సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు ఉన్న గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ గడువు మార్చి 31 వరకు మాత్రమే ఉంది. దాన్ని మరో మూడు నెలలు పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
దీంతో లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు జూన్ 30 వరకు సమయం ఇస్తున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.
బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును ఇటీవల సుప్రీంకోర్టు నిరవధికంగా పొడిగించింది.
ఈ విషయంపై కోర్టు తుది తీర్పు చెప్పే వరకు ఆధార్‌తో అనుసంధానికి ఇబ్బందులు లేవని వెల్లడించింది. ఇప్పటికే ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలు నిమిత్తం పాన్‌కార్డు-ఆధార్‌ల అనుసంధానం గడువు తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications