బీజేపీ ఓట్ బ్యాంక్ పై కేజ్రీ గురి - మోదీ కొత్త ప్లాన్..!!
ఢిల్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్రిముఖ పోటీలో పై చేయి కోసం మూడు పార్టీలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవటం కోసం ఆప్.. ఎలాగైనా అధికారం దక్కించు కోవటం కోసం బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సైతం ఈ సారి గెలుపు తమదే అంటూ ధీమాగా కనిపిస్తోంది. మూడు పార్టీలు పోటా పోటీగా హామీలు గుప్పిస్తున్నాయి. ఆప్ మధ్య తరగతి ప్రజలే టార్గెట్ గా మేనిఫెస్టో ప్రకటించింది. బీజేపీ తమ ప్లాన్ మార్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఓట్ బ్యాంక్ పైన కేజ్రీవాల్ గురి పెట్టారు. మహిళలు, యువత, అద్దెకు ఉండే వారికి హామీలు ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు మధ్య తరగతి పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు కీలక అంశాలను ప్రతిపాదించారు. పరోక్షంగా బీజేపీకి ఇరకాటంలోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో లోకు కౌంటర్ గా కేజ్రీవాల్ కొత్త గేమ్ ప్రారంభించారు. కేంద్రం ఫిబ్రవరి 1న ప్రతిపాదించే కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులను పది శాతానికి పెంచాలని డిమాండ్ చేసారు. అదే విధంగా ప్రయివేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ పైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఇక, ఉన్నత విద్య చదివే వారికి రాయితీలతో పాటుగా స్కాలర్ షిప్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.

కేంద్రం ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పది శాతానికి పెంచాలని కోరారు. ఇక, ఆరోగ్య భీమా పై భారం తగ్గించేలా ప్రీమియం చెల్లింపుల పైన పన్ను రద్దు చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఏడు లక్షల ఆదాయ పరిమితిని పది లక్షలకు పెంచాలని కేజ్రీవాల్ కోరారు. నిత్యవసర సరకులపై జీఎస్టీని ఎత్తివేయాలిని డిమాండ్ చేసారు. సీనియర్ సిటిజన్లకు భరోసా ఇచ్చేలా కొత్త పెన్షన్ విధానంతో పాటుగా ఆర్దిక పరంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇక, వీరికి దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేసారు.
ఇదే సమయంలో కేంద్రం ముందు మరో కీలక ప్రతిపాదన చేసారు. రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజెన్లకు టికెట్ రాయితీ 50 శాతం అమలు చేయాలని కేజ్రీవాల్ కోరారు. పన్నుల ద్వారా వచ్చే సొమ్మును విద్య రంగానికి కేటాయించటంతో పాటుగా మధ్య తరగతికి అండగా నిలిచేందుకు నిత్యావసరాల ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు వినియోగిస్తున్నామని వివరించారు. విద్యుత్ ఛార్జీలు, నీటి ఛార్జీలను తగ్గించామని గుర్తు చేసారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications