రాఖీ బిర్లాకు టిక్కెట్: కేజ్రీవాల్ పార్టీలో విభేదాలు, ధర్నా
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో (ఎఎపి)లో విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి రాఖీ బిర్లాకు లోకసభ టిక్కెట్ ఇవ్వాలని కేజ్రీవాల్ నిర్ణయించారట. దీనిపై పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. లోకసభకు పోటీ చేసే ఇరవై మంది అభ్యర్థులతో ఎఎపి కొన్ని రోజుల క్రితం మొదటి జాబితా విడుదల చేసింది.
మరికొందరితో కూడిన రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెండు లిస్టులో నలభై మంది పేర్లు ఉండనున్నాయి. ఇందులో రాఖీ బిర్లా పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఇది బయటకు పొక్కింది. దాంతో పార్టీ కార్యకర్తలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఢిల్లీలోని హనుమాన్ రోడ్డులో పార్టీ కార్యాలయం ముందు ఆదివారం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.

పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. టికెట్ కోసం రాఖీ బిర్లా దరఖాస్తు చేసుకోకపోయినా ఆమెకు టికెట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పైగా ఎమ్మెల్యేలకు లోకసభ టికెట్లు ఇవ్వమని ప్రకటించి ఇప్పుడు ఆమె పేరును పరిగణనలోకి తీసుకోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు.
దాదాపు ఆరుగురు నేతలు పార్టీ కార్యాలయం ఎదుట రాఖీ బిర్లాకు టిక్కెట్‌కు నిరసన ఆందోళన వ్యక్తం చేశారట. కాగా, రాఖీ బిర్లాను కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కృష్ణ తీర్థ పైన నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని కేజ్రీవాల్ భావించారట.












Click it and Unblock the Notifications