నాపైకి కుక్కలను ఉసిగొల్పాడు: ఆప్ ఎంఎల్ఏ భార్య

న్యూఢిల్లీ: గర్బవతిగా ఉన్న సమయంలో తాను చాలా చిత్రహింసలకు గురైనానని, తన భర్త వేదింపులు భరించలేకపోయానని అమ్ ఆధ్మీ పార్టీ శాసన సభ్యుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చిత్రహింసలు పెట్టిన తన భర్త మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మనవి చేస్తున్నారు.

ఆప్ ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ భార్య లిపిక మిత్రా చేసిన ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం సోమనాథ్ భారతీ ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ ను కలిసి లిపిక చేసిన ఫిర్యాదు పై వివరణ ఇచ్చారు.

లిపిక ఢిల్లీ మహిళ కమిషన్ కు చేసిన 26 పేజీల ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. అందులోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. షాది డాట్ కాంలో సోమనాథ్, లిపికకు పరిచయం అయ్యింది. తనకు అంతర్జాతీయ న్యాయసంస్థ ఉందని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని లిపిక ఆరోపిస్తున్నది.

AAP leader Somnath Bharti's wife files police complaint in Delhi

తరువాత నిత్యం చిత్రహింసలు మొదలైనాయని అన్నారు. తాను గర్బవతిగా ఉన్న సమయంలో తన మీద కుక్కల్ని వదిలి పెట్టి శారీరకంగా, మానసికంగా హింసించాడని లిపిక ఫిర్యాదులో తెలిపింది. ఆ సమయంలో తాను వేధింపులు భరించలేక ఏడుస్తున్న సమయంలో శాడిస్టు లాగా ప్రవర్తించాడని ఆరోపించారు.

తాను మూడో సారి గర్బవతి అయినప్పుడు 7వ నెలలో అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చాడని, ఆ సమయంలో తను భాదను తట్టుకొలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు, మహిళ కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

లిపిక ఫిర్యాదులోని అంశాలు పరిశీలించి సోమనాథ్ భారతి మీద తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మహిళ కమీషన్ అధ్యక్షురాలు బర్ఖా సింగ్ తెలిపారు. అదే విదంగా లిపిక ఫిర్యాదులు చేశారని విచారణ చేస్తున్నామని శుక్రవారం ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+