ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీ స్ధానికుడు కాదంటూ పిటిషన్, కులాన్ని కూడా టార్గెట్ చేశారు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. కారణం అరవింద్ కేజ్రీవాల్ స్ధానికుడు కాదండూ ఆయనపై కోర్టులో కిరణ్ వాలియా పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తర ప్రదేశ్ స్ధానికత ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఎలా పోటీ చేస్తారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీంతో అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ నోటీసులు జారీ చేసింది. తన అభ్యర్ధిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ఇలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రకటనల రూపంలో బీజేపీ దాడి కొనసాగిస్తూనే ఉంది.

న్యూస్ పేపర్‌లో బీజేపీ తన తొలి ప్రకటనలో అన్నా హాజారే, కాంగ్రెస్‌తో లింక్ చేసి విమర్శించగా, తాజాగా మరో ప్రకటనలో కేజ్రీవాల్‌ను వ్యంగంగా చిత్రీకరించింది. ఢిల్లీ ప్రధాన వార్తా పత్రికల్లో కార్టూన్ రూపంలో ఓ ప్రకటనను రూపొందించింది.
తొలిసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన గత ఏడాది జనవరిలో రాజీనామా చేసిన ఓ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకులకు అంతరాయం కలిగించడం, ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకులకు తనన్ని ఆహ్వానించకపోవడంతో వీఐపీ పాస్ అడగటాన్ని అందులో పేర్కొంది.
దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ 'ఉపద్రవి-గోత్రా' అంటు తన కులంపై కూడా విమర్శలు చేసింది. దీనిపై ఏఏపీ నేత అశుతోష్ మాట్లాడుతూ "ఈరోజు న్యూస్ పేపర్‌లో బీజేపీ ప్రకటన బెల్టు కింద ఉంది. ఇది బీజేపీ నిరాశను సూచిస్తుంది. బీజేపీ కేజ్రీవాల్ గోత్రాను దూషించడం, యావత్ అగర్వాల్ కమ్యూనిటీని దూషించడమే" అని అన్నారు.
రెండు గంటల్లో బీజేపీ గనుకు క్షమాపణలు చెప్పనట్లైతే, వారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అటు ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపై వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఫిబ్రవరి 7న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications