4 రాష్ట్రాల్లో అసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్ ఇవే.. మోదీకి బిగ్ షాక్..
దేశంలోని 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గుజరాత్ లోని రెండు స్థానాలైన విసావదార్, కాదీలో ఫలితాలు చూస్తే విసావదార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే కాదీలో బీజేపీ గెలుపొందింది. ఇక కేరళలోని నీలాంబూర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పంజాబ్ లోని లుధియాన వెస్ట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ కొట్టింది. ఇక పశ్చిమ బెంగాల్ లోని కాలీగంజ్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐదు అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్ లో రెండు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కటి చొప్పున అసెంబ్లీ స్థానాల్లో జూన్ 19న పోలింగ్ జరిగింది. ఈమేరకు తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాల్లో గుజరాత్ లోని విసావదార్, కాదీ స్థానాల్లో ఒకటి ఆప్, మరొకటి బీజేపీ గెలుచుకున్నాయి. కాదీలో బీజేపీ గెలుపొందగా.. విసావదార్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆప్ గెలుపొందడం ఓ రకంగా బీజేపీకి షాకింగ్ అని చెప్పొచ్చు.
ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే.. కేరళలోని నీలాంబూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే పంజాబ్ లోని లుధియాన వెస్ట్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవలం చేసుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్ లోని కాలీగంజ్ స్థానంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మొత్తం ఐదు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం ఒక్కచోట మాత్రమే విజయం సాధించడం గమనార్హం. ఆప్ రెండు చోట్ల విజయ దుందుభి మోగించింది.

గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానంలో ప్రస్తుత శాసనసభ్యులు మరణించారు. ఇక కేరళ, గుజరాత్ లో ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలను నిర్వహించింది ఎన్నికల కమిషన్.












Click it and Unblock the Notifications