వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి హత్యపై తల్లిదండ్రుల పుస్తకం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ కూతురు హత్యపై ఒక పుస్తకం రాయడం ప్రారంభించామని దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ అన్నారు. ఈ పుస్తకం ద్వారా నిజాలలను వెల్లడించాలని అనుకుంటున్నామని వారు చెప్పారు. తమ కూతురు ఆరుషి హత్య కేసులో ప్రస్తుం జైలులో ఉన్న వారిని ఓ మీడియా సంస్థ లేఖల ద్వారా ఇంటర్వ్యూ చేసింది.

ఆరుషి హత్యపై పుస్తకం రాస్తున్నప్పుడు చెప్పలేని బాధగా అనిపించి ప్రస్తుతానికి పక్కకు పెట్టామని చెప్పారు. ఆ పుస్తకం పూర్తయితే దాన్ని చదివిన తర్వాతైన వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటారని చెప్పారు. ఆరుషి హత్యపై పుస్తకం వచ్చింది, ఇప్పుడు ఓ సినిమా కూడా వస్తుంది, దీని ప్రభావం మీ కేసుపై ఉంటుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తాము కూడా జైలులో ట్రైలర్ చూశామని, ఆ చిత్రం రెండు వైపుల ఆలోచించి తీసినట్లు ఉందనిపిస్తుందని, కానీ, దుర్భుద్దితో సీబీఐ చేసిన విచారణ జోలికి వెళ్లనట్లు కనిపిస్తుందని తెలిపారు.

Aarushi parents to write book on murder case

ఎవరు ఏం సినిమా తీసినా నిజాలు ఉన్నా లేకున్నా తాము మాత్రం వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని రాస్తున్నామని, కొంత బాధతోపాటు ప్రస్తుతం కేసులు, పిటిషన్ల వ్యవహారంతో బిజీగా ఉన్నందున త్వరలో దానిని పూర్తి చేసి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. సీబీఐ పక్షపాతంతో తమపై దర్యాప్తు జరిపిందని తెలిపారు.

తమ బాధను ఎవరూ వినడం లేదని, తమ వైపే ఆలోచించకుండా దర్యాప్తు చేసి దోషులుగా సృష్టించారని చెప్పారు. తమ కూతురును కోల్పోయిన బాధలో ఉండగానే కేసులో ఇరికించి ముద్దాయిలుగా చిత్రీకరించారని చెప్పారు. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించగా.. కొన్ని సార్లు తప్ప ఎక్కువగా నమ్మలేమని, కానీ ఒక విషయం నిజం అని నిరూపించడానికి ముఖ్యంగా విశ్వాసం, ఓపిక అనేవి ఒక వ్యక్తికి ఉండాలని సాయిబాబా చెప్పిన మాటలు నమ్ముతామని అన్నారు. తాము అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశామని, అది ఇంకా విచారణ రావాల్సి ఉందని తెలిపారు.

English summary
arushi Talwar parents are writing book on their daughter's murder in the jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X