బెంగాల్‌లో బీజేపీకి 200 సీట్లు పక్కా -దీదీ అహంకారం చెల్లదిక -ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్

పశ్చిమ బెంగాల్ లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడనుండగా, బడా నేతలు కీలక ప్రాంతాల్లో ప్రచారంతో హోరెత్తించారు. అధికార టీఎంసీకి, గడిచిన రెండేళ్లలో బాగా బలపడ్డ బీజేపీకి మధ్య పోరు హోరాహోరిగా కొనసాగుతోంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఈ సారి జరుగుతోన్న ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఎన్నికల ప్రచారం కోసం గురువారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. జోయ్‌పూర్, తల్డాంగ్రా, కాక్‌ద్వీప్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున రాజ్ నాథ్ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించగలదని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

Absolutely sure that BJP will win more than 200 seats in West Bengal polls: Rajnath Singh

గడిచిన పదేళ్లలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారు అభివృద్ధిని విస్మరించిందని, బెంగాల్ సర్వతోముఖాభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని రాజ్ నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచునేదే తప్ప అహంకారంతో నడవదని మమతను ఉద్దేశించి రాజ్ నాథ్ విమర్శలు చేశారు.

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మొత్తం 8దశల్లో పోలింగ్ జరుగనుంది. మొదటి దశ పోలింగ్ మార్చి 27న ఉండగా, గురువారంతో ప్రచార పర్వం ముగిసింది. చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+