జైల్లో గర్భవతి అయిన మహిళా ఖైదీ..కారణం ఎవరో తెలుసా..!
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్‌లో నేవీ అధికారి డ్రమ్ హత్య ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్య కేసులో భార్య ముస్కాన్ రాస్తోగి మరియు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ముస్కాన్‌కు, సౌరభ్ రాజ్ పూత్ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరికి 2019లో ఒక పాప పుట్టింది. ప్రేమ వివాహం కావడంతో సౌరభ్ రాజ్ పూత్ అతని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు.
ఇదే సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కోసం సౌరభ్ మరో ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో తన స్కూల్ డేస్ ఫ్రెండ్ సాహిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త సౌరభ్ భార్య ముస్కాన్‌కు పద్దతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ భార్యలో ఎలాంటి మార్పు లేదు.కొన్ని రోజుల క్రితం తన కూతురు బర్త్ డే కోసం సౌరభ్ వచ్చాడు. దీన్ని భార్య, ఆమె ప్రియుడు ఓర్చుకోలేక పోయాడు. అన్నంలో విషం పెట్టారు. అది తిని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాక.. పదునైన ఆయుధాలతో కొట్టిచంపారు. అంతేకాకుండా... బాడీని 16 ముక్కలు చేసి డ్రమ్ లో వేశారు.

ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఘోరం అంతా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ లు రిమాండ్లో ఉన్నారు.హత్య చేసిన తర్వాత ముస్కాన్ మరియు సాహిల్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు.విచారణలో ముస్కాన్ 2023 నవంబర్ నుండే హత్యకు పథకం వేసినట్లు తేలింది.సాహిల్ గదిలో తంత్రిక చిహ్నాలు మరియు భయానకమైన రాతలు కనుగొనబడ్డాయి. ముస్కాన్, సాహిల్‌ను తన తల్లిలా నటించి ఫేక్ స్నాప్‌చాట్ ఖాతాల ద్వారా బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని నమ్మించి, హత్య చేయమని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య తర్వాత సౌరభ్ తలను బాత్రూమ్‌లో ఒక రాత్రంతా ఉంచి, శరీరాన్ని బెడ్ బాక్స్‌లో దాచి, ఆపై డ్రమ్‌లో వేశారు. ముస్కాన్ ఆ రాత్రంతా ఆ బెడ్‌పైనే నిద్రపోయింది. సాహిల్ తల మరియు చేతులను తన ఇంటికి తీసుకువెళ్లాడు.సౌరభ్ కుమార్తె తన తండ్రి డ్రమ్‌లో ఉన్నాడని చెప్పినట్లు అతని తల్లి తెలిపింది.పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. సౌరభ్‌ను అత్యంత దారుణంగా చంపారు. అతని తల మరియు చేతులు శరీరం నుండి వేరు చేయబడ్డాయి.
శరీరాన్ని డ్రమ్‌లో పట్టించడానికి కాళ్లు వెనక్కి మడిచారు.సౌరభ్‌ను గుండెలో మూడుసార్లు బలంగా పొడిచారని, మెడ కోశారని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే జైల్లో ఉన్న ముస్కాన్ గర్భవతి అయిందని తెలుస్తోంది. జైలులో ఉన్న ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది.జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తదుపరి నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ పరీక్ష నిర్వహిస్తారు.ఈ ఘటన మీరట్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications