ఎంత ధైర్యం రా ?, సీఎం, డీసీఎం, హోం మంత్రికి బాంబు బెదిరింపులు, రామేశ్వరం కేఫ్ కేసు రిపీట్ !

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఇదే నెల 1వ తేదీన బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసును సవాలుగా తీసుకున్న బెంగళూరు పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేస్తున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. ఎన్ఐఏ అధికారులు ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలిసింది.

బెంగళూరు రామేశ్వరం కేఫ్ కేసు విషయం గురించి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుతో ఐటీ హబ్ బెంగళూరు సిటీ ప్రజలు హడలిపోతున్నారు. బెంగళూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం సిద్దరామయ్య మీడియా ద్వారా ప్రజలకు మనవ చేశారు.

Accused who sent bomb threats to Karnataka CM DCM Home Minister through e-mail

ఇప్పుడు బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడులాగే మరి కొన్ని ప్రాంతాలో బాంబు పేలుళ్లు జరుపుతామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు ఈ మెయిల్ ద్వారా బెదిరించడం కలకలం రేపింది. మంగళవారం ఈ మెయిల్ బాంబు బెదిరింపులు రావడంతో బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Accused who sent bomb threats to Karnataka CM DCM Home Minister through e-mail

తమకు 2. 5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ 2 కోట్ల 27 లక్షలు ఇవ్వకపోతే బస్ స్టాండ్ లు, రైల్వేస్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని నిందితులు ఈ మెయిల్ ద్వారా బెదిరించారు. సీఎం, డీసీఎం, హోం మంత్రి, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ లు రావడంతో స్వయంప్రేరితంగా కేసు నమోదు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మొత్తం మీద ఇలా ఈ మెయిల్ ద్వారా ఏకంగా సీఎంకు, డీసీఎం, హోం మంత్రి, బెంగళూరు పోలీసు బాస్ కు బాంబు బెదిరింపులు చేసిన నిందితులు చిక్కితే మాత్రం వారికి కుష్కా తినిపించడానికి సీసీబీ పోలీసులు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+