చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, ఓటు హక్కు మీ ఇష్టం, కమల్ హాసన్ ఫైర్, ఊహించని మద్దతు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: బహుబాష నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ దూసుకుపోతున్నారు. తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా కమల్ హాసన్ ప్రజలను కలుసుకుంటున్నారు. శనివారం ఈ రోడ్ జిల్లాలో కమల్ హాసన్ పర్యటించి తమిళనాడులో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉందని కమల్ హాసన్ మండిపడ్డారు.

ఆవనాషి

ఆవనాషి

ఈరోడ్ జిల్లాలోని ఆవనాషి ప్రాంతంలో కమల్ హాసన్ శనివారం రోడ్ షో నిర్వహించారు. కమల్ హాసన్ రోడ్ షోకి ఊహించని మద్దతు వచ్చింది. స్థానికులు కమల్ హాసన్ ను చూడటానికి పోటీ పడ్డారు. రద్దీ ఎక్కవ కావడంతో కమల్ హాసన్ కారులో నుంచి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు.

చేతకాని ప్రభుత్వం

చేతకాని ప్రభుత్వం

ప్రజలు సమస్యలు, కష్టాలు తీర్చడంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కమల్ హాసన్ ఆరోపించారు. ప్రజల కష్టాలు, సమస్యలు చూసి తట్టుకోలేక తాను తప్పనిపరిస్థితుల్లో రాజకీయాల్లో వచ్చానని కమల్ హాసన్ చెప్పారు.

ఓటు హక్కు మీ ఇష్టం

ఓటు హక్కు మీ ఇష్టం

అన్నాడీఎంకే లాంటి చేతకాని ప్రభుత్వానికి మీరు ఓటు వేసి తప్పు చేశారని కమల్ హాసన్ అన్నారు. ఓటు హక్కు మీ ఇష్టం, ఎవరు సమర్థవంతంగా పని చేసి మీ కష్టాలు తీర్చుతారని భావిస్తారో వారికి ఓటు వెయ్యాలని కమల్ హాసన్ మనవి చేశారు.

 మూడు జిల్లాలు

మూడు జిల్లాలు

కమల్ హాసన్ ఆదివారం రాత్రి వరకు తమిళనాడులోని ఈరోడ్, కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటించి స్థానికులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇదే పమయంలొ మూడు జిల్లాల్లోని తన అభిమాన సంఘాల నాయకులతో కమల్ హాసన్ భేటీకానున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Makkal Needhi Maiyam party leader and actor Kamal Hassan is touring today and tomorrow in Coimbatore, Tirupur and Erode districts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి