వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ దెబ్బ: రమ్యను నెత్తిన పెట్టుకున్న రాహుల్ గాంధీ, ఆమె క్యాప్టెన్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కొన్ని నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రమ్యకు కొత్త బాధ్యతలు అప్పగించి ఆమె కాంగ్రెస్ పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు పూర్తిగా రమ్యకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్యాప్టెన్ గా రమ్య తన సత్తా చూపించడానికి సిద్దం అయ్యారు. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహించిన దీపేందర్ హూడాకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మోడీ దెబ్బతో దిమ్మ తిరిగింది

మోడీ దెబ్బతో దిమ్మ తిరిగింది

2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోడీ సూచనతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోషల్ మీడియా టీం శక్తి వంచనలేకుండా పని చేసింది. 272 మ్యాజిక్ సంఖ్యతో నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ దూసుకు వెళ్లారు.

మ్యాజిక్ ఫిగర్, మిషన్ 272

మ్యాజిక్ ఫిగర్, మిషన్ 272

సోషల్ మీడియాలో 272 మ్యాజిక్ ఫిగర్ తో ప్రచారంలో దూసుకు వెళ్లిన ఎన్డీఏ లోక్ సభ ఎన్నికల్లో 336 సీట్లు సొంతం చేసుకుంది. సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో బీజేపీ చూపించింది. మోడీ దెబ్బతో షాక్ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి సోషల్ మీడియాపై ఆసక్తి చూపిస్తోంది.

మోడీ హవా అంటే అదే

మోడీ హవా అంటే అదే

2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నరేంద్ర మోడీ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు దగ్గర అయ్యారు. ఇప్పటికీ ఆయన ప్రతి రోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలను పలకరిస్తున్నారు. మోడీని ఢీకొట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు కొత్త సారథిని నియమించింది.

రమ్య ఎందుకు ?

రమ్య ఎందుకు ?

దక్షిణాధి రాష్ట్రాల్లో రమ్యను కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. ఇప్పటికే ఆమె కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సినీ గ్లామర్ తో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గర కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందో ఆ పార్టీ నాయకులకే తెలియాలి.

పార్టీ నుంచి వెళ్లిపోతారని

పార్టీ నుంచి వెళ్లిపోతారని

రమ్య రాజకీయ గురువు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువు బాటలోనే రమ్య బీజేపీలో చేరుతారని జోరుగానే ప్రచారం జరిగింది. దానికి తోడు కొన్ని నెలల నుంచి రమ్య పార్టీ కార్యకలాపాలుకు దూరంగా ఉంటోంది. ఆమె పార్టీ వీడకుండా ఇప్పుడు కొత్త బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

రాహుల్ గాంధీ దెబ్బ

రాహుల్ గాంధీ దెబ్బ

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు రమ్యకు అప్పగించాలని రాహుల్ గాంధీ ఆదేశించారని, అందుకే దీపేందర్ హూడాను ఆ పదవి నుంచి తప్పించి ఆమెకు బాధ్యతలు అప్పగించారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
అయితే రమ్య ఆపదవికి న్యాయం చేస్తారా, కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఐటీ నిపుణులు ఉన్నా ఆమెకే ఎందుకు ఆ పదవి అప్పగించారు ? అనే ప్రశ్న అప్పుడే మొదలైయ్యింది.

మోడీ, రాహుల్ గురించి రమ్య ఎప్పుడూ ?

మోడీ, రాహుల్ గురించి రమ్య ఎప్పుడూ ?

సోషల్ మీడియాలో బిజీబిజీగా ఉండే రమ్య వీలుచిక్కినప్పుడు రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. అదే సమయంలో ప్రధాని మోడీ మీద విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో మాత్రం ప్రత్యక్షం అయ్యే రమ్య ప్రజల్లోకి పెద్దగా రారు. అలాంటి రమ్య కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్యాప్టెన్ పదవికి ఎంత మాత్రం న్యాయం చేస్తారో ? అంటు ఆ పార్టీ నాయకులు చర్చ మొదలుపెట్టారు.

English summary
Actor, politician Ramya has been given the charge of the Congress' social media campaign replacing Deepender Hooda, who is expected to be given some organisational responsibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X