వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీతో హీరో విజయ్ నేడు భేటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సినీ హీరో విజయ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. ఆయన బుధవారం సాయంత్రం కొయంబత్తూర్‌లో మోడీతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇటీవల నరేంద్ర మోడీ సమావేశమైన విషయం తెలిసిందే.

మోడీని తమ హీరో కలుస్తారంటూ విజయ్ అభిమానులు ట్వీట్ చేశారు. అయితే, విజయ్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని వారన్నారు. మోడీతో భేటీకి విజయ్ ఎదురు చూస్తున్నట్లు కూడా అందులో రాశారు. నరేంద్ర మోడీ కోయంబత్తూర్‌లో బుధవారం ప్రచార సభలో ప్రసంగించనున్నారు. అయితే, విజయ్ మోడీతో వేదికను పంచుకుంటారా, లేదా అనేది తెలియడం లేదు.

మురుగదాసన్ దర్శకత్వంలోని నిర్మితమవుతున్న కత్తి సినిమాలో విజయ్ ప్రస్తుతం నటిస్తున్నారు. కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు విరామం ఇచ్చి విజయ్ మోడీని కలుస్తారని అంటున్నారు.

విజయ్, నరేంద్ర మోడీ భేటీ

విజయ్, నరేంద్ర మోడీ భేటీ

తమిళనాడులో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న బిజెపి విషయంలో నరేంద్ర మోడీ, విజయ్ భేటీకి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.

విజయ్ ఫ్యాన్స్ ఓట్లు మల్లుతాయా...

విజయ్ ఫ్యాన్స్ ఓట్లు మల్లుతాయా...

నరేంద్ర మోడీతో భేటీ వల్ల విజయ్ అభిమానుల ఓట్లు బిజెపికి మల్లుతాయా అనే చర్చ జరుగుతోంది.

విజయ్ రాజకీయ అనుబంధాలు.

విజయ్ రాజకీయ అనుబంధాలు.

రాజకీయ నాయకులను విజయ్ కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాహుల్ గాంధీని కలిశారు. విజయ్‌ను చేరదీయడానికి కాంగ్రెసు ప్రయత్నించింది. కానీ అది ఫలితం ఇవ్వలేదు.

డిఎంకెకు విజయ్ వ్యతిరేకం..

డిఎంకెకు విజయ్ వ్యతిరేకం..

డిఎంకె కుటుంబంతో విజయ్‌కు ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే. ఆ కుటుంబంతో కొన్ని విషయాల్లో విభేదించి చాలా ఏళ్ల క్రితమే తెగదెంపులు చేసుకున్నారు.

విజయ్ కష్టాలు...

విజయ్ కష్టాలు...

డిఎంకె కుటుంబంతో తెగదెంపులు చేసుకోవడంతో విజయ్ సినిమా రంగంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. కావలం సినిమా విడుదల సమయంలో ఆయన చిక్కులు ఎదుర్కున్నారు. దీంతో తాను రాజకీయాల్లోకి వచ్చి, పార్టీని స్థాపిస్థానని ప్రకటించారు.

అన్నాడియంకెకు దగ్గర..

అన్నాడియంకెకు దగ్గర..

డిఎంకెతో తెగదెంపులు చేసుకున్న విజయ్ అన్నాడియంకెకు దగ్గరై పార్టీని స్థాపించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. జయలలిత పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు.

జయలలితకూ దూరం..

జయలలితకూ దూరం..

రెండేళ్ల క్రితం విజయ్ ముఖ్యమంత్రి జయలలితకు కూడా దూరమయ్యారు. తన సినిమా తలైవాను, కమల్ హాసన్ సినిమా విశ్వరూపంను ప్రభుత్వం నిషేధించింది.

తలైవా చిక్కులు..

తలైవా చిక్కులు..

కొన్ని థియేటర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో థియేటర్ విజయ్ తలైవా సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించింది.

తలైవా...

తలైవా...

సినిమా నుంచి కొన్ని భాగాలను తీసేయాలని ఒత్తిళ్లు వచ్చాయి. కాప్షన్‌ను కూడా తీసేయాలని ఒత్తిడి వచ్చింది. వాటిని తొలగించిన తర్వాత విడుదలకు అంగీకరించారు. ఆ సమయంలో విజయ్ తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

ఇప్పుడిలా...

ఇప్పుడిలా...

ప్రస్తుతం విజయ్ బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆయన మోడీని కలుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

English summary
Vijay is the latest actor, who is set to meet Narendra Modi. Well, after superstar Rajinikanth, the Illayathalapathy is meeting the BJP's Prime Ministerial candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X