Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరీకీ అందుబాటులోకి విద్య, వైద్యం.. అదానీ కీలక ఒప్పందం

అదానీ ఫౌండేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించడం కోసం మహారాష్ట్రకు చెందిన డీమ్డ్ యూనివర్సిటీ అయిన దత్తా మేఘ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(డీఎంఐహెచ్‌ఈఆర్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో వైద్య శాస్త్రంలో ఆవిష్కరణలతోపాటు ప్రజలకు అందుబాటులో వైద్యం, విద్య ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సేవే దైవారాధన అన్న గౌతమ్ అదానీ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది.

దేశం ప్రగతిపథంలో నడవాలంటే నాణ్యమైన వైద్యం, విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ధ్యేయంతో అదానీ గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన డీమ్డ్ యూనివర్సిటీ దత్తా మేఘ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(డీఎంఐహెచ్‌ఈఆర్‌) తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు విద్య, వైద్యానికి నైపుణ్య కేంద్రం ఏర్పాటుతో పాటు నూతన ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

డీఎంఐహెచ్‌ఈఆర్ ప్రస్తుతం 15 విభాగాల్లో 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులతో సహా 217 రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. ఈ సంస్థ "టెంపుల్ ఆఫ్ హెల్త్ కేర్" అనే భావనతో సేవ, కరుణ అనే సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం.

ఈ మేరకు అదానీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌతమ్ అదానీ మాట్లాడుతూ, "ఇది మాకు ఒక గొప్ప అవకాశం. ఈ ఒప్పందం నూతన ఆవిష్కరణలకు ఒక వేదిక అవుతుంది. మేమంతా కలిసి 2047 నాటికి వికసిత్ భారత్ ను నిర్మిస్తాం అని అన్నారు. ఇక డీఎంఐహెచ్‌ఈఆర్ వ్యవస్థాపకులు డాక్టర్ మేఘే మాట్లాడుతూ.. " గత 35 సంవత్సరాలుగా మేము ఒక స్వయం సమృద్ధి గల సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం. ఇది దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ ను నిర్మించాలనే లక్ష్యాన్ని చేరుకుంటాం" అని అన్నారు.

Adani Foundation Partners with DMIHER to Boost Healthcare and Education in Maharashtra

ఈ ఒప్పందం ద్వారా అదానీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరింతమంది ప్రజలకు చేరి గొప్ప ఫలితాన్ని అందిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ నైపుణ్య కేంద్రం ద్వారా వైద్య విద్య మరింత అందుబాటులోకి వస్తుందని, తద్వారా దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+