ముంబైకి రా నీ పని చెప్తా: విమానాశ్రయంలో సింగర్ దురుసు, ఎట్టకేలకు సారీ
విమానాశ్రయాల్లో విమాన సిబ్బందిపై వివిఐపీలు, సెలబ్రిటీల దురుసుతనం తగ్గడం లేదు. తాజాగా, బాలీవుడ్ గాయకుడు ఆదిత్య నారాయణ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు.
రాయ్‌పూర్: విమానాశ్రయాల్లో విమాన సిబ్బందిపై వివిఐపీలు, సెలబ్రిటీల దురుసుతనం తగ్గడం లేదు. తాజాగా, బాలీవుడ్ గాయకుడు ఆదిత్య నారాయణ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు.
ఆదిత్య నారాయణ.. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు. ఆదిత్య ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవపడ్డారు. దసరా సందర్భంగా కచేరీ నిమిత్తం ఆదిత్య చత్తీస్‌గఢ్ వచ్చారు.
కచేరీ పూర్తయ్యాక రాయ్‌పూర్ నుంచి ముంబై బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ వద్ద ఎయిర్ లైన్స్ అధికారులతో గొడవపడ్డారు.

ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీ తెచ్చినందుకు అధికారులు ఆదిత్యను నిలిపివేశారు.
దాంతో తానో సెలబ్రిటీనని కావాల్సినంత లగేజీని తీసుకెళతానంటూ ఆదిత్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
అంతేకాదు, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ముంబైకి రాకపోవునని, అప్పుడు నీ పని చెప్తానని బెదిరించాడు. దాంతో ఆగ్రహించిన ఇండిగో సిబ్బంది అతను క్షమాపణ చెప్పేవరకు విమానం ఎక్కనివ్వమని తేల్చి చెప్పారు. ఇక గత్యంతరంలేక ఆదిత్య వారికి క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications