ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మొన్నటికి మొన్నే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సమాజ్‌వాది పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు అతిక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. దానికి కొద్ది రోజుల ముందే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

అతని పేరు అనిల్ దుజానా. మీరట్‌కు చెందిన స్టేట్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొద్దిసేపటి కిందటే అతణ్ని ఎన్‌కౌంటర్ చేశారు. మీరట్ శివార్లల్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో అతను మరణించినట్లు ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ ఘటనతో మీరట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మీరట్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

 encounter-

అనిల్ దుజానా స్వస్థలం గౌతమ్ బుద్ధనగర్ జిల్లా బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుజానా గ్రామం. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, గూండా యాక్ట్ వంటి వివిధ చట్టాల కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ కిల్లర్‌గా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

అతని మీద వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 62 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందులో 18 మర్డర్ కేసులే కావడం అతని నేరప్రవృత్తి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీనికోసం ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో పలుచోట్ల ముఠాలను ఏర్పాటు చేశాడు. అనిల్ దుజానా కోసం పోలీసులు సుదీర్ఘకాలంగా వేట సాగిస్తోన్నారు.

అతణ్ని పట్టిచ్చిన వారికి 50,000 రూపాయల బహుమానాన్ని సైతం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. మయూర్ విహార్ ఏరియాలో ఓ సెటిల్‌మెంట్ కోసం వచ్చిన అనిల్ దుజానాను పోలీసులు వల వేసి పట్టుకున్నారు. తాజాగా ఎస్టీఎఫ్ పోలీసులు దుజానాను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన మీరట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసుల బలగాలను మోహరింపజేశారు.

గతంలో సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్లను పెంచి పోషించిందని, తమ హయాంలో వారందరూ ప్రాణభిక్ష ప్రసాదించాలంటూ వేడుకుంటోన్నారంటూ ఇటీవలే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల్లోనే గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా ఎన్‌కౌంటర్ కావడం ప్రాధాన్యంతను సంతరించుకుంది. అటు యోగి ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందంటూ వాదించే వారు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+