కరోనాతో పోరాడి పక్షవాతానికి గురైన బాలీవుడ్ నటి .. కరోనా సమరంలో నర్సుగా సేవలందించిన నటికి పెద్దకష్టం
ఆ బాలీవుడ్ నటి కరోనా సమయంలో అందరిలా ఇంటికి పరిమితం కాలేదు . బాలీవుడ్ తారలు ఇంటి పనులను స్వయంగా చేసే వీడియోలు పోస్ట్ చేస్తుంటే కరోనా పై ప్రపంచం జరుపుతున్న సమరంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్ గా సేవలు అందించారు బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా . లాక్ డౌన్ సమయంలో కరోనాతో పోరాటం చేస్తున్న వారిని రక్షించడం కోసం శిఖా మల్హోత్ర నర్సుగా పని చేశారు . ఆ తర్వాత కరోనా బారిన పడిన ఆమె కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కరోనా మహమ్మారి తో పోరాటం చేసిన శిఖా మల్హోత్రా తాజాగా పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు.

ముంబైలో నర్సుగా కరోనా రోగులకు సేవలందించిన శిఖా మల్హోత్రా
షారుఖ్ ఖాన్‌తో కలిసి ఫ్యాన్ సినిమాలో పనిచేసిన నటి శిఖా మల్హోత్రా కరోనా కష్టకాలంలో నేను సైతం అంటూ కరోనా బారిన పడిన వారికి సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. ముంబైలోని జోగేశ్వరిలోని బిఎంసి నడుపుతున్న ట్రామా హాస్పిటల్‌లో పనిచేయడానికి నర్సుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేశారు. ఆ సమయంలో ఆమె అందరి ప్రశంసలు అందుకున్నారు . తాను వర్ధమాన్ మహావీర్ మెడికల్ మరియు సాఫ్దార్జంగ్ హాస్పిటల్ నుండి బిఎస్సి హానర్స్ నర్స్ చదివానని, నర్సి గా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె నర్సింగ్ డిగ్రీ గురించి వెల్లడించారు.

కరోనా బారిన పడి పోరాడిన శిఖా .. కరోనా నుండి కోలుకున్నాక పక్షవాతం
గత ఆరు నెలలుగా నర్సుగా పనిచేస్తున్న శిఖా మల్హోత్రా సుమారు ఒక నెల క్రితం, కరోనా వైరస్ బారిన పడ్డారు కాని కరోనా మహమ్మారితో సాగించిన పోరాటంలో ఆమె త్వరగానే కోలుకున్నారు. అయితే కరోనా తగ్గిన తర్వాత తాజాగా ఇప్పుడు, పక్షవాతం బారినపడి నటి శిఖా మల్హోత్రా ఆసుపత్రి పాలయ్యారు. శిఖా మల్హోత్రా కు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆమె శరీర కుడి వైపు తీవ్రంగా ప్రభావితమైంది. ఆమెను విలే పార్లేలోని కూపర్ ఆసుపత్రిలో చేర్పించారు అని శిఖా పిఆర్ మేనేజర్ అశ్వని శుక్లా తెలిపారు.
Recommended Video

ఫ్రంట్ లైన్ వారియర్ గా పని చేసిన శిఖా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్ల పోస్ట్ లు
ఆసుపత్రి నుండి ఆమె చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నా అంటూ చెప్పారు. ఈ ఫోటోలో ఆమెకు వైద్య చికిత్సలు జరుగుతున్నట్లుగా ఉంది. ఒక నెల ముందు కోవిడ్-19 తో జరిగిన యుద్ధంలో గెలిచిన తరువాత, బాలీవుడ్ నటి అయినప్పటికీ కరోనా కష్ట కాలంలో గత ఆరునెలలుగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ గా పని చేస్తున్న ఆమె ఇటీవల అర్ధరాత్రి ఆమెకు పక్షవాతం రావడం అభిమానులకు ఆవేదన కలిగించింది. ఆమె త్వరగా కోలుకోవాలని శిఖా మల్హోత్ర ఆరోగ్యంగా తిరిగి రావాలని పలువురు అభిమానులు , నెటిజన్లు కోరుకుంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications