పీవోకేపై సంచలన ప్రకటన చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో ప్రతీకార దాడిని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత,భూమి, గాలి సముద్రం మీదుగా అన్ని సైనిక దాడులను నిలిపివేయడానికి రెండు దేశాలు పరస్పర ఒప్పందానికి వచ్చిన రెండ్రోజులకే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

After India-Pak Ceasefire  PM Modi to Deliver Key 8 PM Speech live updates and highlights in telugu

మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి పాక్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న 9 కేంద్రాలపై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా దాడులు నిర్వహించింది.ఈ ఆపరేషన్‌లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇక ప్రధాని ప్రసంగానికి ముందు రక్షణమంత్రి రక్షణశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు త్రివిధ దళాల అధినేతలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో భేటీ అయ్యారు.ఇక ప్రధాని ప్రసంగంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

May 12, 2025, 8:37 pm IST

పాక్‌ను మూడు రోజుల్లో కాళ్లబేరానికి వచ్చేలా చేశాం - ప్రధాని మోదీ
May 12, 2025, 8:36 pm IST

పీవోకేపై మాత్రమే చర్చలు జరుపుతాము- ప్రధాని మోదీ
May 12, 2025, 8:35 pm IST

ఉగ్రవాదం ఉన్నంత కాలం పాక్‌తో చర్చలు లేవు - ప్రధాని మోదీ
May 12, 2025, 8:33 pm IST

మనది దొంగదెబ్బ కాదు, పాక్ గుండెల మీద కొట్టాము - ప్రధాని మోదీ
May 12, 2025, 8:28 pm IST

ఉగ్రవాదులు మతం పేరిట విధ్వంసం స‌ృష్ఠించారు.
May 12, 2025, 8:27 pm IST

పాకిస్థాన్‌పై బాంబుల వర్షం కురిపించాము - ప్రధాని మోదీ
May 12, 2025, 8:24 pm IST

అణుబాంబులతో మనల్ని ఎవరూ కూడా బెదిరించలేరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
May 12, 2025, 8:23 pm IST

ఉగ్రదాడి తర్వాత దేశం అంతా కూడా ఒక్కతాటిపై నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు
May 12, 2025, 8:22 pm IST

పీవోకేను వదలడం తప్ప పాక్‌కు మరో గత్యంతరం లేదని ప్రధాని మోదీ వెల్లడించారు.
May 12, 2025, 8:21 pm IST

ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టిల్లు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
May 12, 2025, 8:20 pm IST

పాక్ అణుబాంబుతో బెదిరిస్తే ఏం చేయాలో మనకు బాగా తెలుసునని ప్రధాని మోదీ తెలిపారు.
May 12, 2025, 8:18 pm IST

పాక్ మరోసారి తోక జాడిస్తే తాట తీస్తాం
May 12, 2025, 8:16 pm IST

పాక్ కలలో కూడా మన జోలికి రాకుండా చేశాం - ప్రధాని మోదీ
May 12, 2025, 8:16 pm IST

మన సైన్యం ముందు పాక్ డ్రోన్లు నిలవలేకపోయాయి
May 12, 2025, 8:13 pm IST

ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్నాం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ
May 12, 2025, 8:10 pm IST

పాక్‌లోని ఉగ్రవాదుల సంస్థలను ధ్వంసం చేశాం - ప్రధాని మోదీ
May 12, 2025, 8:09 pm IST

భారత మహిళల నుదట బొట్టు తొలగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో పాక్‌కు రుచి చూపించాం మీడయా సమావేశంలో ప్రధాని మోదీ
May 12, 2025, 8:06 pm IST

భారత్ సైన్యానికి నా సెల్యూట్ - ప్రధాని మోదీ
May 12, 2025, 8:03 pm IST

ఆపరేషన్ సింధుర్ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడనున్న ప్రధాని
May 12, 2025, 7:51 pm IST

ఇండియా, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియా సమావేశం
ఇండియా, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియా సమావేశం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+