Prahlad Joshi: డ్యూటీలోకి కొత్త విద్యామంత్రి జోషీ- కాక్రోచ్ పార్టీ తొలి డిమాండ్..!

నీట్ సహా జాతీయ స్దాయి పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పోరాటాలు చేసి విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిన్న ఆయన రాజీనామాతో నిరసనలు విరమించింది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ స్ధానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమితులైన ప్రహ్లాద్ జోషీ (Prahlad Joshi) తాజాగా తన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. ప్రహ్లాద్ జోషీ ముందు తన తొలి ప్రతిపాదన పెట్టింది.

ఈ రోజు తాను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించానంటూ ప్రహ్లాద్ జోషీ ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి, ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వినమ్రతతో, బాధ్యతా భావంతో తాను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఈ ట్వీట్ కు తాను ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన ఫొటోల్ని కూడా జత చేశారు. ఈ ట్వీట్ కు స్పందనగా కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు.

After Prahlad Joshi Takes Charge CJP Demands More Jobs and Better Opportunities for Students

యువత భవిష్యత్తు కోసం మీరు సానుకూలంగా పనిచేస్తారని ఆశిస్తున్నామని ప్రహ్లాద్ జోషీని ఉద్దేశించి సౌరవ్ దాస్ ట్వీట్ చేశారు.
అలాగే విద్యార్థుల కోసం సాధ్యమైనంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని, లేదా ఉపాధి అయినా కల్పించాలని సౌరవ్ దాస్ ప్రహ్లాద్ జోషీని కోరారు. తద్వారా విద్యార్ధులు కొత్త విద్యామంత్రి నుంచి ఏం ఆశిస్తున్నారో కాక్రోచ్ పార్టీ ప్రతినిధి చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో విఫలమైతే మళ్లీ పోరాటం తప్పదనే సంకేతాన్ని కూడా ఇచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+