వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 ఏళ్ళ బంధానికి తెర, నవనిర్మాణ్ సేనతో శివసేన మైత్రి

బిజెపితో తెగతెంపులు చేసుకొన్న తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతో శివసేన పొత్తు కుదుర్చుకోనే అవకాశం ఉంది. ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో కాదు, ఇతర ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు పొత్తును కొనసాగించే అవ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి:25 ఏళ్ళ బంధానికితెరపడింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే ముంబాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రకటించింది.తాను కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు బిజెపి విముఖత చూపడంతో ఆ పార్టీతో పొత్తును తెగతెంపులు చేసుకొంటున్నట్టు శివసేన ప్రకటించింది.మరో వైపు శివసేన, మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి.ఈ మేరకు రెండు పార్టీల మద్య సీట్ల పంపకంపై చర్చలు సాగుతున్నాయి.

మహరాష్ట్రలో బిజెపి, శివసేన బంధానికి తెరపడింది. 25 ఏళ్ళ పాటు ఈ రెండు పార్టీల మద్య ఉన్న పొత్తు బంధాన్ని తెగతెంపులు చేసుకొంటున్నట్టు శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే ప్రకటించారు.

ముంబాయి మున్సిఫల్ కార్పోరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో శివసేన డిమాండ్ చేసిన సీట్లను ఇచ్చేందుకు బిజెపి సిద్దంగా లేదు.

తాను కోరిన సీట్లు ఇచ్చేందుకు బిజెపి సిద్దంగా లేకపోవడంతో ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీచేస్తామని శివసేన ప్రకటించింది.

బిజెపితో బంధాన్ని తెంచుకొన్న శివసేన

బిజెపితో బంధాన్ని తెంచుకొన్న శివసేన

25 ఏళ్ళ పాటు ఉన్నబంధాన్ని బిజెపితో తెగతెంపులు చేసుకొంది శివసేన. 25 ఏళ్ళ క్రితం శివసేన,బిజెపిల మద్య ఎన్నికల ఒప్పందాలు ప్రారంభమయ్యాయి. ఆనాటి నుండి ఈ రెండు పార్టీలు ప్రతి ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకొని పోటీచేస్తున్నాయి. అయితే ఈ దఫా మాత్రం శివసేన బిజెపితో పొత్తును తెగతెంపులు చేసుకొంది.

శివసేన కోరిన సీట్లు ఇవ్వని బిజెపి

శివసేన కోరిన సీట్లు ఇవ్వని బిజెపి

ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి శివసేన కోరిన టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్దంగా లేదు. ముంబాయి కార్పోరేషన్ లో ఉన్న 227 సీట్లలో 114 సీట్లు కావాలని శివసేన పట్టుబడుతోంది.అయితే ఇన్ని స్థానాలను ఇచ్చేందుకుగాను బిజెపి సిద్దంగా లేదు.దీంతో పొత్తుకు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.

సీట్ల కోసం ప్రాధేయపడం

సీట్ల కోసం ప్రాధేయపడం

ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన, బిజెపి ల మధ్య పొత్తు చెడిపోవడానికి సీట్ల పంపకమే ప్రధాన కారణమైంది.అయితే బిజెపి అనుసరించిన తీరుపై శివసేన చీఫ్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. సీట్లు కేటాయించాలని కోరుతూ ఎవరిని ప్రాథేయపడబోమని శివసేన చీఫ్ ఉథ్ధవ్ థాక్రే చెప్పారు.బిజెపి నాయకులు అనుసరించిన తీరుతో శివసేన చీఫ్ మనస్థాపానికి గురయ్యారు. ఆ పార్టీతో పొత్తును తెగతెంపులు చేసుకొన్నాడు.

ఎన్ డి ఏ తో పొత్తు ఇవ్వని శివసేన

ఎన్ డి ఏ తో పొత్తు ఇవ్వని శివసేన

బిజెపితో శివసేన పొత్తును తెగతెంపులు చేసుకొంది.అయితే ఎన్ డి ఏ తో పొత్తు విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్ డి ఏ లో సేన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది.మహరాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపి, శివసేన పార్టీల మధ్య పొత్తు భాగస్వామ్యాన్ని దెబ్బతీశాయి. పూణె, నాసిక్, నాగపూర్ , ముంబాయి కార్పోరేషన్లకు ఈ ఏడాది ఫిబ్రవరి 21 న, ఎన్నికలు జరగనున్నాయి.రెండు దశల్లో రాష్ట్రంలోని 25 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు పిభ్రవరి మాసంలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎం.ఎన్.ఎస్ తోనే శివసేన సీట్ల పంపకంపై చర్చలు

ఎం.ఎన్.ఎస్ తోనే శివసేన సీట్ల పంపకంపై చర్చలు

శివసేన ,మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన మద్య సీట్ల సర్ధుబాటుపై చర్చలు సాగుతున్నాయని రెండు పార్టీలకు చెందిన ముఖ్యులు కొందరు ధృవీకరించారు.ముంబాయి కార్పోరేషన్ లో శివసేన 177 స్థానాల్లో, యాభై స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పోటీచేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మద్య చర్చలు సాగుతున్నాయి. ఇంకా చర్చల్లో స్పష్టత వచ్చి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో వైపు ముంబాయితో పాటు రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కూడ పోటీ చేయనున్నాయి.

English summary
After snubbing bjp,,shiv sena might join hands with mns,alliance between shivasena and maharastra nava nirma sena samiti in civic polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X