వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల విలీనంతో కస్టమర్ల ఖాతాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి...?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 10 బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకీకృత ప్రయత్నాల్లో భాగంగా పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక బ్యాంకుల విలీనంలో భాగంగా ఇండియన్ బ్యాంకును అలహాబాదు బ్యాంకుతో, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓబీసీ యునైటెడ్ బ్యాంకులు పీఎన్‌బీ బ్యాంకుతో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం, కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకులను కూడా ఒక్కటిగా కలుపుతున్నట్లు చెప్పారు.

బ్యాంకింగ్ వ్యవస్థను ఏకీకృతం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు కొనసాగింపే ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. గతేడాది బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులను విలీనం చేసింది ప్రభుత్వం. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అసోసియేట్‌ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు కూడా విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల కస్టమర్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది.. ఏమైనా మార్పులు ఉంటాయా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

After the banks merger what will change for the customer,here is the list

ఇక ఆయా బ్యాంకులో ఖాతాలున్న కస్టమర్లకు ఎలాంటి మార్పలు ఉంటాయి..?

1. కొత్త చెక్‌బుక్, డెబిట్/క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు

2.అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ, బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా మారుతుంది
3.IFSC కోడ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఇన్‌కంట్యాక్స్ వద్ద కూడా కొత్త మార్పులను నమోదు చేయాల్సి ఉంటుంది
4. ఇప్పటి వరకున్న ఈఎంఐలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది
5. బిల్ పేమెంట్లకు కొత్త సూచనలు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది
6. బ్యాంకు బ్రాంచ్ మారే అవకాశం ఉంటుంది
7. బ్యాంకుకు సంబంధించిన వోచర్లు ఇతరత్రా స్టేషనరీ మారుతుంది
8. సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీ రేటు మారే అవకాశం

ఇక బ్యాంకుల విలీనంతో కస్టమర్‌కు మారని అంశాలు

1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రేట్లు మారవు

2. బ్యాంకు విలీనంతో అప్పటికే మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వేసి ఉంటే .... అప్పటి వడ్డీరేటే వర్తిస్తుంది. కొత్తగా పెరిగినా తగ్గినా ఆ వడ్డీ రేట్లు వర్తించవు

3. రుణాలపై వడ్డీల్లో కూడా మార్పుండదు

4. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు

మొత్తానికి బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకు కస్టమర్లలో గందరగోళం నెలకొంది. అయితే దీనిపై కేంద్రప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

English summary
Finance Minister Nirmala Sitharaman on Friday announced a slew of PSU bank mergers as part of consolidation efforts and said, “We want banks with strong national presence and enhanced risk appetite.” Bank customers are worried as what will change in near future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X