ఘోర అవమానం: విద్యార్థుల ముందే టీచర్ దుస్తులు చించేశాడు

ఆగ్రా: విద్యార్థులకు మంచిమాటలు చెప్పి సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిలా మారిపోయాడు. ఏకంగా తరగతి గదిలోనే విద్యార్థులు చూస్తుండగా మహిళా ఉపాధ్యాయురాలి బట్టలు చించేశాడు. తనను ప్రేమించలేదన్న కారణంగా ఆ దుర్మాగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని కస్‌గంజ్ ప్రైమరీ స్కూల్లో చోటు చేసుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు జితేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతిపై అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న జితేందర్ గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.

 Agra sSchool teacher molested in classroom as shocked primary students watch

ఈ నేపథ్యంలో స్కూల్ నుంచి వెళుతుండగా జితేందర్ ఆమెను అడ్డగించాడు. దీంతో ఆ యువతి అతని చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న జితేందర్ ఆమెపై కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఈ ఈ క్రమంలోనే శనివారం స్కూల్లో క్లాస్ రూమ్‌లో పాఠాలు చెబుతున్న ఆమెను.. అక్కడే దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు.

జితేందర్‌తో పాటు వెళ్లిన మరో నలుగురు కూడా ఆమెను విద్యార్థులందరి ముందూ క్లాస్‌రూమ్‌లో వేధింపులకు గురిచేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి స్టాఫ్ రూమ్‌ వైపుగా పరుగులు తీసింది. దీంతో జితేందర్ పరారయ్యాడు.

జితేందర్ తన ఇంటి ఎదురుగా ఉంటాడని, తనకు పెళ్లయిందని చెప్పినా వినకుండా తరచూ వెంటపడి వేధిస్తున్నాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. నిందితుడు జితేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+