ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది ఏఐఏడీఎంకే. గత ఎన్నికల్లో కూడా పొత్తుతో బరిలోకి దిగి చేతులు కాల్చుకుందీ పార్టీ. ఆ తర్వాత దూరమైంది గానీ.. ఎన్నికల అవసరాలు మళ్లీ ఈ రెండు పార్టీలను దగ్గరికి చేర్చాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. తన తాహతుకు మించిన సీట్లను బీజేపీ అడుగుతోండటమే దీనికి ప్రధాన కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. నేడు ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సైతం ఢిల్లీలో అమిత్ షాతో సీట్ల సర్దుబాటుపై మాట్లాడనున్నారు. దీని తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెన్నైకి వచ్చి ఒప్పందాలను ఖరారు చేయనున్నారు.
సీట్ల సంఖ్యతో పాటు బీజేపీ కోరుతున్న నిర్దుష్ట నియోజకవర్గాలపై ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. ఈపీఎస్ ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా వీటిపైనే చర్చలు జరిగాయి. సింగనల్లూర్, నాగర్‌కోయిల్, మదురై (పశ్చిమ, ఉత్తర), తిరుప్పరన్‌కుండ్రం, తిరుత్తణి, కోయంబత్తూర్ (ఉత్తర, దక్షిణ), వేలచేరి వంటి కీలక స్థానాలపై ఇరు పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు. తాము కోరుకున్న నియోజకవర్గాలను అడగడంలో తప్పు లేదని నైనార్ నాగేంద్రన్ తేల్చి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈపీఎస్-అమిత్ షా భేటీ ఈ ప్రతిష్ఠంభనను తొలగిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే 29 స్థానాలకు అంగీకరించగా, బీజేపీ 30 స్థానాలు డిమాండ్ చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే అమిత్ షాతో భేటీ కోసం ఈపీఎస్ సుమారు రెండు గంటల పాటు ఎదురుచూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాగా.. 10 గంటల తర్వాతే అమిత్ షాను కలుసుకున్నారాయన. 15 నుండి 20 నిమిషాల పాటు మాత్రమే వీరిద్దరి మధ్య భేటీ సాగింది.
-
విజయ్ కు బిగ్ షాక్.. -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
విజయ్ లీక్డ్ మూవీ చూశా: ఈ టైమ్ లో అది గానీ విడుదలైతే కొంపలు అంటుకుంటాయ్ -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఐప్యాక్ కూసాలు కదిలాయ్.. !! -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications