జయ కోసం చెన్నై టు బెంగళూరు పాదయాత్ర (పిక్చర్స్)
చెన్నై: ఆస్తుల కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలితకు బెయిల్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై తమిళనాడు అట్టుడుకుతోంది. అధికార అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల నిరసనలు, నిరశనలతో మార్మోగుతోంది.
ఆదివారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బస్సు సర్వీసులను నిలిపివేయడంతోపాటు ఏడో తేదీ వరకు పాఠశాలలు తెరిచే ప్రసక్తి లేదని ప్రైవేటు స్కూళ్ల సమాఖ్య కూడా ప్రకటించింది.
ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోవడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. ఆరువేలకు పైగా ప్రైవేటు బస్సులను నిలిపివేయడంతో పరిస్థితి మరింత అయోమయంగా మారింది.

అన్నాడీఎంకే
జయలలితకు న్యాయం జరగాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్దలు ఇద్దరు 350 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 'అమ్మకు న్యాయం కోసం' పేరిట ఆ పార్టీ కార్యకర్తలు మధిల్ పెరుమాళ్, సియాన్ దువియెర్ చెన్నై నుండి బెంగళూరులోని పరప్పన అగ్రగార కేంద్ర కారాగారం వరకు పాదయాత్ర చేపట్టారు.

అన్నాడీఎంకే
జయలలితకు అన్యాయంగా శిక్ష విధించారని భావిస్తున్న వారిద్దరు అందుకు నిరసనగా నల్ల దుస్తులు ధరించి ఈ నెల 1వ తేదీన చెన్నైలో పాదయాత్ర మొదలుపెట్టారు. వారు సోమవారం బెంగళూరు సమీపంలోని కృష్ణగిరి దాటారు. మంగళవారం రాత్రికి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు పరిసరాలకు చేరుకుంటారని తెలుస్తోంది. జయలలిత పైన వీరు చూపుతున్న అభిమానం.. మరో జయ అభిమాని సౌందర రాజన్‌ను కదిలించింది. ఆయన కూడా వీరి పాదయాత్రలో పాలు పంచుకున్నాడు.

అన్నాడీఎంకే
చెన్నై, నీలగిరి, కన్యాకుమారి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటు బస్సులను నిలిపివేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

అన్నాడీఎంకే
మరోపక్క తమ అధినేత్రి త్వరితగతిన విడుదల కావాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

అన్నాడీఎంకే
అన్నాడీఎంకే శాసనసభ్యులు, అలాగే చెన్నై మేయర్ దురైస్వామి నల్లదుస్తులు ధరించి ఎంజి రామచంద్రన్ విగ్రహం వద్ద నిరాహారదీక్ష జరిపారు.

అన్నాడీఎంకే
రాష్ట్రంలో దాదాపు 4,500 ప్రైవేటు స్కూళ్లను మూసివేసిన యాజమాన్యాలు ఏడో తేదీన చెన్నైలో నిరసన ఉద్యమానికి సిద్ధమయ్యాయి.

అన్నాడీఎంకే
ఉద్యమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్ కూడా పాల్గొంటున్నారని ప్రైవేటు పాఠశాలల సమాఖ్య కార్యదర్శి డిసి ఇలన్‌గోవన్ వెల్లడించారు. డ్రైవర్లు, ఓనర్లు, కండక్టర్లు సమ్మె చేయడం వల్ల కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో 800 బస్సులు ఆగిపోయాయి.

అన్నాడీఎంకే
అలాగే జయలలితను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర లిక్కర్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా కోయంబత్తూరులో ప్రదర్శన జరిపారు.

అన్నాడీఎంకే
దాదాపు వారం రోజులుగా జరుగుతున్న ఈ నిరసనల కార్యకర్తలు సోమ, మంగళవారాల్లో మరింత ఉద్ధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications