హలో దినకరన్: ఒక్క ఫోన్ కాల్ తో ఢిల్లీకి పరుగో పరుగు. తిక్కచేష్టలు చేస్తే శాశ్వతంగా !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) వెలివేత నాయకుడు టీటీవీ దినకరన్ శుక్రవారం ఢిల్లీకి పరుగు తీశారు. శుక్రవారం ఉదయం వరకు నానా హంగామా చేసిన దినకరన్ కు ఒక్క సారిగా ఢిల్లీకి పరుగు తియ్యడంతో ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు హడలిపోయారు.

దినకరన్ దెబ్బకు పళనిసామి దిమ్మ తిరిగింది: 32 మంది జంప్, మంత్రులు, ప్రభుత్వం ఫట్ !

దినకరన్ కు ఏమయ్యింది ? ఎందుకు ఉన్నట్టుండి ఢిల్లీకి పరుగు తీశాడు అంటూ ఇప్పుడు చెన్నైలో చర్చ మొదలైయ్యింది. టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చిన ఇద్దరు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు అయోమయంలో పడిపోయారు.

ఎమ్మెల్యేలతో భేటీకి రెడీ అయితే !

ఎమ్మెల్యేలతో భేటీకి రెడీ అయితే !

తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన టీటీవీ అన్నాడీఎంకే పార్టీలో చక్రం తిప్పాలని ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో బెంగళూరు వెళ్లి జైల్లో శశికళను కలిసిన తరువాత మళ్లీ చెన్నై చేరుకుని ప్రభుత్వంలో చీలిక తీసుకొచ్చి పళనిసామితో ఆడుకోవాలని ప్రయత్నించాడు.

32 మందితో సీఎంను బెదిరించాడు !

32 మందితో సీఎంను బెదిరించాడు !

పళనిసామి వర్గంలోని 32 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులను తనవైపు తిప్పుకున్న దినకరన్ ఎడప్పాడి పళనిసామికి రెండు రోజులు నిద్రలేకుండా చేశారు. శుక్రవారం మళ్లీ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేతో భేటీకి సిద్దం అయ్యాడు. మరి కొంత మంది ఎమ్మెల్చేలకు గాలం వెయ్యాలని ప్లాన్ వేశాడు.

ఒక్క ఫోన్ వచ్చింది, పరుగో పరుగు !

ఒక్క ఫోన్ వచ్చింది, పరుగో పరుగు !

ఎమ్మెల్యేలను శుక్రవారం తన ఇంటికి రావాలని దినకరన్ సూచించాడు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో భేటీకి సిద్దం అయ్యారు. స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి ఐరన్ చేసిన దుస్తులు వేసుకుని రెడీ అవుతున్న సమయంలో దినకరన్ మొబైల్ కు ఫోన్ వచ్చిందని, వెంటనే ఆయన ఢిల్లీకి పరుగు తీశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి ?

ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి ?

దినకరన్ కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే మంజూరు అయ్యింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దినకరన్ ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ నానా హంగామా చేశాడు. అయితే ఒక్క ఫోన్ కాల్ తో దినకరన్ దిమ్మతిరిగింది.

ఢిల్లీ దెబ్బ అంటున్నారు !

ఢిల్లీ దెబ్బ అంటున్నారు !

అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లిన దినకరన్ ఎక్కడ ఉన్నారు అంటూ అక్కడే ఉన్న తమిళ మీడియా ఆరా తీసింది. అయితే దినకరన్ ఆచూకి మాత్రం గుర్తించలేకపోయారు. దినకరన్ ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావడానికి వెళ్లారా ? అంటూ క్రైం బ్రాంచ్ అధికారులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం.

కేంద్రం వార్నింగ్ ఇచ్చిందా ?

కేంద్రం వార్నింగ్ ఇచ్చిందా ?

ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చెయ్యడానికి దినకరన్ ప్రయత్నించాడు. అయితే కేంద్రంలోని కొందరు పెద్దలు దినకరన్ కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆయన హడలిపోయారని సమాచారం.

శాశ్వతంగా జైల్లోనే !

శాశ్వతంగా జైల్లోనే !

తిక్క చేష్టలు చేస్తే అనేక కేసుల విచారణ ఎదుర్కొంటున్న దినకరన్ శాశ్వతంగా జైల్లో ఉండే ఏర్పాట్లు జరుగుతాయని ఢిల్లీ పెద్దలు హెచ్చరించడంతో ఆయన వెనక్కి తగ్గారని తెలిసింది. అందుకే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి దినకరన్ ఢిల్లీ వెళ్లారని తెలిసింది. ఈ విషయంపై దినకరన్ మద్దతుదారులను మీడియా కదిలిస్తే నో కామెంట్ అంటూ చల్లగా జారుకుంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV DInakaran has left for Delhi all of a sudden. And his meeting of MLAs is also stopped. AIADMK Sources said that Delhi is warning to TTV Dinakaran over party MLAs.
Please Wait while comments are loading...