ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు, మోడీ జిందాబాద్: టెక్కీల నినాదాలు !

Recommended Video

    ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు | Oneindia Telugu

    బెంగళూరు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రహస్య మంతనాలు జరిపారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కర్ణాటకకు వచ్చారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరే ముందు ఎయిర్ పోర్టులో సిద్దరామయ్యత రహస్యంగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్యంగా చర్చలు జరుపుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీని చూసిన వెంటనే కొందరు టెక్కీలు ప్రధాని నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

    కాంగ్రెస్- జేడీఎస్ పొత్తు

    కాంగ్రెస్- జేడీఎస్ పొత్తు

    లోక్ సభ ఎన్నికల సందర్బంగా కులబరిగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించార���. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ సందర్బంలో రెండు పార్టీల పొత్తు విషయంపై రాహుల్ గాంధీ సిద్దరామయ్యతో చర్చించారని సమాచారం.

    ఎన్నికలకు సిద్దం

    ఎన్నికలకు సిద్దం

    కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 18, ఏప్రిల్ 23వ తేదీ జరగనున్నాయి. కర్ణాటలో 20 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 లోక్ సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ పోటీ చే���్తున్నాయి. 20 నియోజక వర్గాల్లో ప్రచారం ఎలా చేస్తారు అంటూ సిద్దరామయ్య నుంచి రాహుల్ గాంధీ వివరాలు సేకరించారని తెలిసింది.

    ఎయిర్ పోర్టులో చర్చ

    ఎయిర్ పోర్టులో చర్చ

    ఢిల్లీ బయలుదేరడానికి రాహుల్ గాంధీ బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో సిద్దరామయ్య చెయ్యి పట్టుకున్న రాహుల్ గాంధీ కొంత దూరంలోకి వెళ్లి ఆయనతో రహస్యంగా చర్చించారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య మాత్రమే సుమారు 15 నిమిషాలు రహస్యంగా చర్చించారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య చర్చలు జరిపే సమయంలో అక్కడికి ఎవ్వరినీ అనుమంతిచలేదు.

    మోదీ జిందాబాద్

    మోదీ జిందాబాద్

    బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన చర్చాగోష్టి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాన్యత టెక్ పార్క్ చేరుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మోడీ జిందాబాద్ అంటూ కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నినాదాలు చెయ్యడంతో రాహుల్ గాంధీ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాన్యత టెక్ పార్క్ లో ఎదురైన అనుభావాల విషయంలో సిద్దరామయ్యతో రాహుల్ గాంధీ చర్చించారని సమాచారం.

    సిద్దరామయ్య హవా

    సిద్దరామయ్య హవా

    కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తనకు చాల పలుకుబడి ఉందని స���ద్దరామయ్య మరోసారి నిరూపించుకున్నారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య చర్చించే సమయంలో సమీపంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ఉన్నా ఆయన్ను కనీసం దగ్గరకు రానివ్వలేదు. ముఖ్యమంత్రి కాకపోయినా అంతటి పలుకుబడి హైకమాంద్ దగ్గర మా నాయకుడికి ఉందని సిద్దరామయ్య అనుచరులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+