మమతపై ఫార్వార్డ్ బ్లాక్: ప్రపంచ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొన్నారో..
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన 64 కీలకదస్త్రాలను శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేయడంపై ఏఐఎఫ్‌బీ(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) హర్షం వ్యక్తం చేసింది.
ఆ దస్త్రాల వలన రెండో ప్రపంచ యుద్ధాన్ని సుభాష్ చంద్రబోస్ ఎలా ఎదుర్కొన్నారో తెలిసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. స్వతంత్య్ర భారతదేశానికి నేతాజీని దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ చేసిన కుట్రలు బయటపడతాయన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 64 ఫైళ్లను బహిర్గతం చేసిన నేపథ్యంలో.. కేంద్రానికి ఏఐఎఫ్‌బి విజ్ఞప్తి చేసింది. కేంద్రం తమ వద్ద ఉన్న 135 ఫైళ్ల సమాచారాన్ని బయటపెట్టాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌ను సుభాష్ చంద్రబోస్ స్థాపించారు.












Click it and Unblock the Notifications