వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ప్రాణం తీసిన ద్రాక్ష, కేక్, స్వీట్స్-ఎయిమ్స్ షాకింగ్ రిపోర్ట్-చికిత్సలో జరిగిందిదే..

|
Google Oneindia TeluguNews

తమిళనాడు మాజీ సీఎం, ఒకప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం ఎప్పటికప్పుడు సంచలనం అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ మరణం వెనుక ఏదో తెలియని మిస్టరీ ఉందన్న అనుమానాలు జనంలో ఉండటమే. వీటిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్ తో విచారణ చేయించింది. ఈ కమిషన్ కు తాజాగా ఎయిమ్స్ డాక్టర్లు ఇచ్చిన నివేదిక చర్చనీయాంశమైంది. జయలలిత ఎలా చనిపోయారన్న దానిపై గతంలో ఇచ్చిన నివేదికతో పోలిస్తే కొన్ని కొత్త అంశాలు ఇందులో ఉండటమే.

జయలలిత మరణం మిస్టరీ

జయలలిత మరణం మిస్టరీ

2016లో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత హఠాత్తుగా అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలో అనారోగ్యంతో పోరాడిన జయలలిత డిసెంబర్లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తమ ఆరాధ్య నేత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. అదే సమయంలో 70 రోజుల పాటు చికిత్స తీసుకున్నా జయలలిత ఎందుకు కోలుకోలేదని, ఆమెను విదేశాలకు ఎందుకు తరలించి చికిత్స అందించలేకపోయారని, అపోలో ఆస్పత్రి ఏదో దాస్తోందన్న ఆనుమానాలు మాత్రం జనాన్నివీడలేదు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వాలపై ఈ మిస్టరీని ఛేదించాలన్న ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీంతో జయ మరణం తర్వాత అన్నాడీఎంకే నేత పన్వీర్ సెల్వం కోరికపై సీఎం పళనిస్వామి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు.

 ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక

ఎయిమ్స్ డాక్టర్ల నివేదిక

జయ మరణం తర్వాత ఈ ఆరేళ్లలో ఎన్నో వైద్య నివేదికలు ఆమెకు అందిన చికిత్సపై అధ్యయన వివరాలు వెల్లడించాయి. అపోలో ఆస్పత్రి కూడా పలుమార్లు జయకు తాము అందించిన వైద్యం వివరాలను బయటపెట్టింది. అయినా జనంలో అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా అప్పట్లో జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళ చివరి రోజుల్లో ఆమె వద్దకు ఎవరినీ అనుమతించలేదన్న ప్రచారం జనంలో అనుమానపు బీజాల్ని నాటేసింది. దీంతో ఆ తర్వాత ఆర్ముగస్వామి కమిషన్ కు ఎయిమ్స్ డాక్టర్లు అందించిన నివేదికలో మరిన్ని వివరాలు వెలుగుచూస్తున్నాయి.

ద్రాక్ష, కేక్, స్వీట్ల వల్లే అనారోగ్యం

ద్రాక్ష, కేక్, స్వీట్ల వల్లే అనారోగ్యం


జయలలిత మరణంపై ఎయిమ్స్ డాక్టర్లు ఆర్ముగ స్వామి కమిషన్ కు మూడు పేజీల నివేదిక అందించారు. ఇందులో జయలలిత అనారోగ్యానికి దారి తీసిన కారణాలతో మొదలుపెట్టి ఆమె చనిపోయే వరకూ ఏం జరిగిందో పూర్తిగా వివరాలు సమర్పించారు. ఇందులో జయలలిత ఆస్పత్రిలో చేరకముందే ఆమెకు ధైరాయిడ్, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపారు. అలాగే స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తీసుకున్నారని వెల్లడించారు. వీటి వల్లే 2016 సెప్టెంబర్ 28న ఆరోగ్యం క్షీణించి ఊపిరి తిత్తుల సమస్య తలెత్తినట్లు నివేదికలో పేర్కొన్నారు.

 జయలలితకు చికిత్స ఇలా..

జయలలితకు చికిత్స ఇలా..

అయితే సీఎం స్ధాయిలో ఉన్న జయలలితకు అత్యున్నత స్ధాయి చికిత్స అందించలేదంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎయిమ్స్ డాక్టర్లు దీనిపైనా పూర్తి వివరాలు అందించారు. జయకు జరిగిన చికిత్సలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోలేదని గుర్తించారు. స్వీట్లు, కేక్, ద్రాక్ష తిని అనారోగ్యం బారిన పడ్డాక.. అక్టోబర్ 7న ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి లండన్ డాక్టర్ రిచర్డ్ బాలే తో పాటు అపోలో, ఎయిమ్స్ కు చెందిన ప్రత్యేక డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారన్నారు. అయితే డిసెంబర్ 3నాటికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని, డిసెంబర్ 4వ తేదీకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైందన్నారు. ఆరోజే ఎక్మో ఏర్పాటు చేసి పర్యవేక్షణలో ఉంచినా 24 గంటల తర్వాత మెదడు, గుండె పనిచేయడం మానేశాయని ఎయిమ్స్ డాక్టర్లు తమ నివేదికలో తెలిపారు.

English summary
aiims report to armugaswamy commision on tamilnadu former cm jayalalitha's death finds several key issues behind this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X