వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఖాతా తెరిచిన మజ్లీస్..

|
Google Oneindia TeluguNews

బీహార్‌లో రాష్ట్రంలో ఎంఐఎం బోణి కొట్టింది. కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన​ ఉప ఎన్నికలో మజ్లిస్‌ విజయం సాధించింది. మహారాష్ట్ర, హార్యాణలో రాష్ట్ర ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన కిషన్‌గంజ్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ విజయం సాధించింది. తన సమీప బీజేపీ అభ్యర్థి పై 10వేల ఓట్ల మెజారీటితో ఎమ్ఐఎమ్ అభ్యర్థి గెలుపోందాడు.

బీహార్‌లో 5 స్థానాలకు ఉప ఎన్నికలు

బీహార్‌లో 5 స్థానాలకు ఉప ఎన్నికలు

తెలంగాణలో తన స్థానాలను పదిలపరుచుకుంటున్న ఎమ్ఐఎమ్ ఇతర రాష్ట్రాల్లో కూడ తన సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈనేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే బీహార్‌లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎమ్ఐఎమ్ అభ్యర్థి ఖమురుల్ హోడా బీజేపీ అభ్యర్థి స్విటీ సింగ్‌పై పదివేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. అయితే మొత్తం అయిదు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కిషన్‌గంజ్ స్థానంలో మాత్రమే బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపింది.

2015లో అతితక్కువ ఓట్లు సాధించిన ఎమ్ఐఎమ్

2015లో అతితక్కువ ఓట్లు సాధించిన ఎమ్ఐఎమ్


2015 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ 6 స్థానాల్లో పోటి చేసింది. అయితే మొత్తం ఆరుస్థానాల్లో అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఆరుస్థానాలకు గాను 36 వేల ఓట్లు మాత్రమే ఎమ్ఐఎమ్ అభ్యర్థులకు పోల్ అయ్యాయి. దీంతో 2019లో జరిగిన సాధరణ లోక్‌సభ ఎన్నికల్లో కూడ ఎమ్ఐఎమ్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థికి హోరాహోరి ఫైట్‌ను ఇచ్చింది. ఇక తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కిషన్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన ఎమ్ఐఎమ్ అభ్యర్థి 70,469 ఓట్లు పోలవగా సమీప బీజేపీ అభ్యర్థి స్వీటీసింగ్‌కు 60,258 ఓట్లు పోలయ్యాయి.

 కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఎమ్ఐఎమ్

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఎమ్ఐఎమ్

ఇక గతం ఎన్నికల్లో కిషన్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ జావెద్ కైవసం చేసుకోగా 2019లో జరిగిన లోక్‌సభ స్థానం నుండి తిరిగి జావెద్ ఎంపీగా పోటి చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఉప ఎన్నికల్లో అనుహ్యంగా అటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోకపోగా బీజేపీ అధికార పార్టీ మిత్రపక్షమైన బీజేపీ సైతం ఓడియింది. మరోవైపు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో విజయం దిశగా ఎంఐఎం కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజారిటీతో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది.

English summary
Bharatiya Janata Party nominee Sweety Singh has lost to All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) candidate Qamrul Hoda in Kishanganj seat of Bihar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X