Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏసీలపై కొత్త రూల్... ఇక అలా చేస్తే ఫైన్ .. జాగ్రత్త!

ఎయిర్ కండిషనర్లు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారిపోయాయి. ఏసీ లేని ఇల్లు ఒకటి కూడా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఏసీలలో పదహారు డిగ్రీలు, 18 డిగ్రీల ఉష్ణోగ్రత మీద పెట్టుకుంటున్న వారు లేకపోలేదు. దీనివల్ల విపరీతమైన పవర్ వినియోగం అవుతుంది. అయితే ఈ విద్యుత్ దుర్వినియోగానికి చెక్ పెట్టడానికి భారత్‌లో ఏసీలకు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల పరిమితి తప్పనిసరి కానుంది.

ఏసీలకు కొత్త రూల్
త్వరలో మార్కెట్‌లోకి రాబోయే కొత్త ఏసీలన్నీ 20 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత, గరిష్ఠంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మాత్రమే పని చేయనున్నాయి. అవును మీరు విన్నది నిజమే.ఈ డిఫాల్ట్‌ సెట్టింగ్‌ ద్వారా విద్యుత్‌ ఆదా అవుతుంది. ముఖ్యంగా డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ సరఫరా చెయ్యొచ్చు. అన్నిటికంటే వేసవిలో పవర్‌ గ్రిడ్‌లపై పడే భారం కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

air conditioners new rule minimum temperature of 20 degrees Celsius and a maximum temperature of 28 degrees center plan

Take a Poll

బీఈఈ కొత్త టెంపరేచర్‌ లిమిట్‌ అమల్లోకి
సాధారణంగా మనదేశంలో ఏసీల ఉష్ణోగ్రత 16-30 డిగ్రీల మధ్య ఉండేది. కానీ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రకారం 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద సెట్టింగ్ ఉండడం మంచిది అనే అభిప్రాయం ఉంది. అయితే, అది తప్పనిసరి అనే సూచన లేదు. కానీ ఇకపైన అలా కుదరదు. అతి త్వరలో ఏసీలపై బీఈఈ కొత్త టెంపరేచర్‌ లిమిట్‌ అమల్లోకి తీసుకురానుంది.

కేంద్రం కొత్త ఆలోచన ఇదే
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏసీల ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్సియస్‌ మధ్య మాత్రమే పనిచేయాలి . దీనిని డిఫాల్ట్ సెట్టింగ్ గా తీసుకురానుంది. ఎయిర్‌ కండిషనర్ల ఉష్ణోగ్రత కనిష్ఠంగా 20°C నుంచి గరిష్ఠంగా 28°C మధ్య పరిమితం చేయనుంది. తద్వారా విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా భారీ ప్రయోజనం చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.

3 ఏళ్లలో రూ.18 వేల నుంచి రూ.20 వేల కోట్ల వరకు డబ్బు ఆదా అంచనా
అంతేకాదు, ఈ కొత్త ఏసీ ఉష్ణోగ్రత నిబంధన ద్వారా వినియోగదారులకు 3 ఏళ్లలో రూ.18 వేల నుంచి రూ.20 వేల కోట్ల వరకు డబ్బు ఆదా అవుతుందని అంచనా వేస్తుంది. ఈ కొత్త నిబంధన కారణంగా కేవలం ఇళ్లల్లో మాత్రమే కాకుండా, ఆఫీసులు హోటల్లు, సినిమా థియేటర్లు, వాహనాలు, ప్రజా రవాణా వ్యవస్థ లోను అన్నిచోట్ల ఏసీ లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

వీలైనంత త్వరలోనే అమలులోకి తీసుకురావాలని భారత్ యోచన
ఏసీ లలో డిఫాల్ట్ టెంపరేచర్ సెటప్ నిబంధనలను ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్న క్రమంలో, మనదేశంలో కూడా ఈ విధానం త్వరలోనే అమలులోకి రానుంది. అయితే భారత్ లో ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని దానిపైన స్పష్టత లేదు కానీ వీలైనంత త్వరలోనే అమలులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో తయారీదారీ సంస్థల తోటి కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. భారత్లో ఏసీల వినియోగం పెరుగుతున్న క్రమంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎప్పటిలోగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది? అనేది వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+