మృతుల కుటుంబాలకు మరో రూ.25 లక్షలు : ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరి కొంతమంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు.
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది మృతి చెందారు.
అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్ ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచాడు. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడటం విశేషం. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు విశ్వాస్ కుమార్ రమేశ్.
అయితే విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు ఇప్పటికే రూ. కోటి చొప్పున ప్రకటించింది టాటా సన్స్ సంస్థ. అయితే తాజాగా ఎయిర్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. టాటా సంస్థ ఇస్తున్న రూ.కోటితో పాటు మరో రూ. 25 లక్షలు ఒక్కో కుటుంబానికి అందజేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయర్ ఇండియా పేర్కొంది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంఘీభావం తెలుపుతోందని.. సానుభూతి వ్యక్తం చేస్తోందని ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications