Air India: ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్-సర్ ఛార్జీల్లో భారీ మార్పు..!
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఎయిర్ ఇండియా (air india) పైనా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్ ఛార్జీల్ని పెంచుతూ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విమాన ప్రయాణికులకు ఛార్జీల మోత మోగబోతోంది. ఇవాళ పెంచిన సర్ ఛార్జీల వివరాలను ఎయిర్ ఇండియా ప్రకటించింది.
పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం, చమురు ధరలను పెంచుతున్న నేపథ్యంలో ఇంధన సర్‌ఛార్జీల్ని పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో టిక్కెట్ ధరల పెంపు జరిగింది. విమానయాన సంస్థలు ఈ పెరుగుదలలో కొంత భాగాన్ని భరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరలు టిక్కెట్ ధరలపై ప్రభావం చూపుతున్నట్లు ఈ పరిణామాల్ని బట్టి అర్ధమవుతోంది.

ఎయిర్ ఇండియా తన దేశీయ ఇంధన సర్‌ఛార్జీని సవరించి, గతంలో ఉన్న ఫ్లాట్ ఛార్జీ స్థానంలో దూరాన్ని బట్టి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రయాణికుడు చెల్లించే అదనపు మొత్తం ఇప్పుడు వారు ప్రయాణించే దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కన 500 కిలోమీటర్ల వరకు ఉండే స్వల్ప-దూర విమాన ప్రయాణాలకు, ప్రయాణికులు అదనంగా రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 501 కిలోమీటర్ల నుండి 1,000 కిలోమీటర్ల మధ్య మార్గాలకు సర్‌ఛార్జ్‌ను రూ.399గా నిర్ణయించారు. 1,001 కిలోమీటర్ల నుండి 1,500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే విమానాలకు రూ.549 సర్‌ఛార్జ్ వర్తిస్తుంది. 1,501 కిలోమీటర్ల నుండి 2,000 కిలోమీటర్ల దూరానికి ప్రయాణికులు రూ.749 చెల్లించాల్సి ఉంటుంది. 2వేల కిలోమీటర్లకు పైబడిన విమానాలకు సర్‌ఛార్జ్ రూ.899 వరకు ఉంటుంది. ఇది దేశీయ కేటగిరీలలోకెల్లా అత్యధికం.సవరించిన ఛార్జీలు ఏప్రిల్ రేపు ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.












Click it and Unblock the Notifications