"రోజూ చస్తూ బతుకుతున్నా": విమాన ప్రమాద మృత్యుంజయుడు సంచలనం..!

యావత్ దేశాన్ని కలచివేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్.. జూన్ 12, 2025 న గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించగా.. ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తాజాగా యూకే కు చెందిన న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తున్నా తాను ఇంకా శారీరకంగా, మానసికంగా బాధను అనుభవిస్తున్నట్లు తెలిపారు.

స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వాస్ కుమార్ రమేశ్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో తన సోదరుడు మృతి చెందాడన్న విషయాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. " నాకు అన్నీ అతనే.. అతడు నాకు వెన్నెముక లాంటివాడు. అతడు లేడన్న సంగతి నేను ఇంకా నమ్మలేకపోతున్నా" అని రమేశ్ చెప్పుకొచ్చాడు. తాను ఇంకా మోకాలి, భుజం, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. మెట్లు ఎక్కడం.. నడవడం ఇబ్బంది కరంగా ఉన్నట్లు తెలిపాడు.

తన ఫ్యామిలీ విషయాలను కూడా వెల్లడించాడు రమేశ్.. తన కుమారుడికి నాలుగున్నరేళ్లు ఉంటాయని.. విమాన ప్రమాదం జరిగినప్పటినుంచి తాను కుమారుడితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని తెలిపాడు. రోజంతా బెడ్ పైనే కూర్చునేవాడినని చెప్పుకొచ్చాడు. ఆ విమాన ప్రమాద జ్ఞాపకాలు తనను వెంటాడుతున్నాయని తెలిపాడు. " నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నేను ఒక్కడినే రూమ్ లో కూర్చొంటున్నాను. నా భార్యతోనూ.. నా కుమారుడితోనూ మాట్లాడడం లేదు. నేను ఒంటరిగా ఉండేందుకే ఇష్ట పడుతున్నాను.

"నా పరిస్థితి దృష్ట్యా నా కుటుంబం నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నాతో పాటు నా కుటుంబం కూడా శారీరకంగా, మానసికంగా ఆవేదన చెందుతుంది. మా అమ్మ నాలుగు నెలలుగా నాతో మాట్లాడడం లేదు. నేనూ ఎక్కువగా మాట్లాడలేక పోతున్నా. నేను రాత్రంతా ఆలోచన చేస్తున్నా.. నేను శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నా. కుటుంబం మొత్తానికి ప్రతిరోజూ బాధాకరంగా ఉంటోంది" అని విశ్వాస్ కుమార్ రమేశ్ చెప్పుకొచ్చాడు.

Air India Miracle Man Vishwash Sky News Drops the Mic on His Untold Escape Story

విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రస్తుతం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అతను శారీకరంగా బాధతోపాటు సైకలాజికల్ ట్రామాలో ఉన్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం అతడు అర్థరాత్రులు నిద్ర లేచేవాడని.. భయపడేవాడని అతడి కజిన్ తెలిపాడు. సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఇక ఎయిర్ ఇండియా రమేశ్ కు నష్టపరిహారం కింద రూ. 22 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తాన్ని రమేశ్ స్వీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+