కేంద్రం వరం- ఇకపై ఆ చార్జీలు ఉండవు

విమాన ప్రయాణికులకు త్వరలో ఒక శుభవార్త అందనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రస్తుతం కొన్ని కీలక నిబంధనలను సవరించాలని ప్రతిపాదించింది. ఈ మార్పుల ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్‌ను రద్దు చేసుకోవడం లేదా మార్చుకోవడం సాధ్యమవుతుంది. రీఫండ్‌కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన ప్రతిపాదనను డీజీసీఏ తెర ముందుకు తీసుకొచ్చింది.

విమాన టికెట్ రద్దు, రీఫండ్ నియమాల్లో మార్పులను తీసుకురావాలని డీజీసీఏ ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీని ప్రకారం- ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకున్న 48 గంటల్లోపు అదనపు రుసుములు లేకుండా వాటిని రద్దు చేయవచ్చు లేదా ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు. టికెట్‌ను రద్దు చేసినప్పుడు, రీఫండ్ మొత్తాన్ని ఎయిర్‌లైన్స్ క్రెడిట్ షెల్/వాలెట్‌లో ఉంచడం అనే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఇది డిఫాల్ట్ పద్ధతి కాదని డీజీసీఏ స్పష్టం చేసింది.

Air Passengers Could Cancel or Amend Tickets Free Within 48 Hours

పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ దీర్ఘకాలంగా విమాన ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న రీఫండ్, రద్దు నిబంధనలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. కొత్త ప్రతిపాదనలో- ప్రయాణికులకు టికెట్ బుకింగ్ తర్వాత 48 గంటల 'లుక్ ఇన్' పీరియడ్ ఇస్తారు. ఈ సమయంలో వారు ఎటువంటి భారీ రుసుములు లేకుండా తమ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ప్రస్తుతం.. టికెట్ రద్దు కోసం వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఏవియేషన్ రెగ్యులేటర్ ఉచిత టికెట్ రద్దు, రీఫండ్ ప్రతిపాదన అన్ని ఎయిర్‌లైన్స్‌కు వర్తిస్తుంది. ఇది- కొన్ని షరతులతో కూడుకుని ఉంటుంది. డొమెస్టిక్ విమానాల విషయంలో ప్రయాణ సమయానికి కనీసం అయిదు రోజుల ముందు బుకింగ్ చేయాలి. అంతర్జాతీయ విమానాలకు ఈ కాలపరిమితి 15 రోజులు. ఈ సమయం తర్వాత రద్దు చేస్తే, నిర్ణీత క్యాన్సెలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. తక్కువ వ్యవధిలో చేసే ప్రయాణాలకు ఈ నియమాలు వర్తించవు.

టికెట్ రద్దుతో పాటు రీఫండ్ నియమాల్లో మార్పులను కూడా డీజీసీఏ ప్రతిపాదించింది. ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, రీఫండ్ బాధ్యత సంబంధిత ఎయిర్ లైన్స్ దే అవుతుంది. 21 పని దినాల్లో రీఫండ్ ప్రక్రియను ఆయా ఎయిర్‌లైన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టికెట్ రీఫండ్‌కు సంబంధించిన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ లో ఈ మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. దీనిపై నవంబర్ 30 వరకు అభిప్రాయాలను ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+