వెలిసిపోతున్న తాజ్ మహల్, గోధుమవర్ణంలోకి...
న్యూఢిల్లీ: ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ కళతప్పుతోంది. వాతావరణ కాలుష్యం వల్ల దాని తేజస్సు మసకబారుతోంది. వాయుకాలుష్యంలోని కర్బన రేణువులు, దుమ్ము తాజ్ మహల్ రంగు వెలసిపోయేలా చేస్తున్నాయని భారత్, అమెరికా పరిశోధకులు గుర్తించారు.
మెరిసే తెల్లని రంగు కాస్తా గోధుమ వర్ణంలోకి మారిపోతున్నట్లుగా వారు తేల్చారు. జీవ పదార్థాలు, శిలాజ ఇంధనాల దహన ప్రక్రియ నుండి వెలువడే కర్భనం, దుమ్ము వంటి కాలుష్య కారకాలు దీని రంగు వెలసిపోయాలే చేస్తున్నట్లు జార్జియా ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ మైకేల్ బెర్గిన్ చెప్పారు.
వీరితో పాటు ఐఐటీ కాన్పూర్, భారత్ పురావస్తు సర్వే స్ంస్థ, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టు పైన కలిసి పని చేశాయి. రంగు మారేందుకు వాయు కాలుష్యం కారణమని అనుమానించారు. అయితే, దీని పద్ధతి ప్రకారం అధ్యయనం ఇంకా జరగలేదు.

తాజ్ మహల్ రంగు మారడానికి కారణం ఏమిటో గుర్తించేందుకు పరిశోధకులు తాజ్ మహల్ సముదాయాంలో 2011 నవంబర్ నుండి 2012 జూన్ వరకు వాయు నమూనాలు సేకరించే పరిగరాలను ఉపయోగించారు. వాయు నమూనాల పరికరాల వడపోత సాధనాల నుండి అతిసూక్ష్మ పదార్థాలను విశ్లేషించారు.
తాజ్‌లోని ప్రధాన ద్వారానికి సమీపంలో పలుచోట్ల సహజమైన మార్బుల్ నమూనాలను ఉంచి, పరిశీలించారు. ఇది సూక్ష్మ రేణువుల కూర్పును తెలుసుకునందుకు తోడ్పడినట్లు బెర్గిన్ పేర్కొన్నారు. దుమ్ము, గోధుమ రంగుతో కూడిన జీవ కర్భనాలను, నల్లని కర్భనాలను వడపోత సాధనాలు, మార్బుల్ నమూనాల పైన గుర్తించారు.












Click it and Unblock the Notifications