వినియోగదారులకు మరోసారి షాకిచ్చిన ఎయిర్‌టెల్: ఇక కనీస రీఛార్జీ ‘డబుల్’ చేసుకోవాల్సిందే!
ప్రముఖ భారత టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మరోసారి తమ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కనీస రీఛార్జీ మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసేసింది. ఇప్పటి వరకు రూ. 23గా ఉన్న మొత్తాన్ని రూ. 45 చేసింది.
ఎలాంటి అవాంతరాలు లేని ఎయిర్‌టెల్ సేవలు పొందాలంటే వినియోగదారులు నెలకు రూ. 23కు బదులు రూ. 45తో రీఛార్జీ చేయించుకోవాల్సి ఉంటుంది. పెంచిన కనీస రీఛార్జీ మొత్తాన్ని ఆదివారం నుంచి అమలు చేస్తున్నామని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇక నుంచి ఎయిర్‌టెల్ వినియోగదారులు 28 రోజులకు రూ. 23కు బదులు రూ. 45తో రీఛార్జీ చేసుకోవాల్సిందే. ఈ రీఛార్జీతో ఎలాంటి డేటా, ఉచిత కాల్స్ లభించవు. అంతేగాక, రూ. 45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జీ చేసుకోకుంటే గత ప్లాన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత సేవలను నిలిపివేస్తామని ఎయిర్‌టెల్ కంపెనీ తేల్చి చెప్పింది.
ఇప్పటికే ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్స్‌ను దాదాపు 50శాతం మేర పెంచిన ఎయిర్‌టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ కనీస రీఛార్జీ మొత్తాన్ని దాదాపు రెట్టింపు పెంచి వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. వరుసగా టెలికాం కంపెనీలన్నీ ఛార్జీలను పెంచుతూ పోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు రీఛార్జీ మొత్తాలను తగ్గించుకుంటున్నారు. డేటా వినియోగాన్ని కూడా తగ్గించుకుంటున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications