5వ తరగతి పాఠ్య పుస్తకంలో ఐశ్వర్యరాయ్ పాట.. ఇలా తయారయ్యారేంట్రా బాబు..!

5వ తరగతి పాఠ్య పుస్తకంలో ఏముంటాయి..? అంటే పాఠాలు ఉంటాయి అని టక్కున చెబుతారు. కానీ ఈ ప్రభుత్వ పుస్తకంలో బాలీవుడ్ పాట ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించిన "హమ్ దిల్ దే చూకే సనామ్" చిత్రంలోని నింబూడా.. నింబూడా సాంగ్ ఫుల్ లిరిక్స్ ను ఈ పుస్తకంలో ముద్రించారు. ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున పెను దుమారం రేపింది. ఈ మేరకు సినిమా పాటను పాఠ్యపుస్తకాల్లో ఎలా ముద్రిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఒడిషాలో జరిగింది.

ఈ ఘటన నేపథ్యంలో ఒడిషా విద్యాశాఖ మంత్రి, అక్కడి ప్రభుత్వంపై తీవ్రంగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై అటు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 27 ఏళ్ల క్రితం అంటే 1999లో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ నటించిన ఈమూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఈ మూవీలోని నింబూడా.. నింబూడా సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ పాట ఒక్కసారిగా 5వ తరగతి పాఠ్య పుస్తకంలో ప్రింట్ కావడం కలకలం రేపుతోంది. మరోవైపు ఇది ప్రింటింగ్ సమయంలో జరిగిన మిస్టేక్ అని అధికారులు భావిస్తున్నారు. ఓ సినిమా పాట పుస్తకాల్లోకి రావడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AishwaryaRai Song Printed inOdisha Class 5 Textbook Sparks Public Outrage AishwaryaRai controversy

ఇదొక్కటే కాదు ఒడిషా ప్రభుత్వం రూపొందించిన ఈ పాఠ్యపుస్తకాల్లో దాదాపు 1600లకు పైగా తప్పులు ఉన్నట్లు తేలింది. 8వ తరగతి పుస్తకాల్లోనే దాదాపు 700 లకు పైగా మిస్టేక్స్ ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక అసెంబ్లీను ఒడిషా అసెంబ్లీగా ప్రింట్ చేశారు. ఐజాక్ న్యూటన్ ను పైలట్ గా.. హంపిని కోణార్క్ సూర్య దేవాలయంగా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక ఈ ఘటనపై స్పందించిన ఒడిషా ప్రభుత్వం విచారణకు కమిటీను వేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+