Akhilesh Yadav: కుంభమేళా తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారో? .. అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: బుధవారం మౌని అమావాస్య సందర్భంగా యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 60 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా తొక్కిసలాటలో మృతుల సంఖ్యను యోగి ప్రభుత్వం దాచిపెట్టిందని.. ఈ ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా ఉండడానికి యూపీ ప్రభుత్వం కుంభమేళాలో మృతుల సంఖ్యను దాచిపెట్టిందని ఆయన ఆరోపించారు.

బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన లోక్ సభ ఎంపీ.." పవిత్ర రోజైన మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానం చేసేందుకు గుమిగూడగా.. సంభవించిన విషాద తీవ్రత గురించి యోగి ప్రభుత్వం సమాచారాన్ని దాచి పెట్టింది. పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి తర్వాత చర్చించవచ్చు. ముందు కుంభమేళా ఘటన గురించి మాట్లాడాలి. ప్రాణాలు కోల్పోయిన వారి శాంతి గురించి మాట్లాడాలి. ఈ మహా కుంభమేళాలో ఎంత మంది చనిపోయారనేది యూపీ ప్రభుత్వం దాచిపెట్టి పరిహారం చెల్లించడం లేదు."అని ఆయన ఆరోపించారు. కుంభమళా మరణాలపై యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అఖిలేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ నైతికంగా పతనమయ్యారని.. అలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటారనేది ఇప్పుడు ప్రశ్న అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Akhilesh Yadav Slams Yogi Government Over Kumbh Mela Stampede Deaths

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత తలెత్తిన పరిస్థితులపై అఖిలేష్ యాదవ్ మాటల దాడి చేస్తూనే ఉన్నారు. మహా కుంభమేళాలో చిక్కుకున్న భక్తులకు ఉపశమనం కలిగించడానికి ఆహారం, దుస్తులు, వైద్య సహాయం,వాహనాలకు ఇంధనం అందించాలని అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహా కుంభమేళాలో చిక్కుకున్న ప్రజలకు ఉపశమనం కలిగించే ఏర్పాట్లకు సంబంధించి యూపీ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఎస్పీ చీఫ్ శుక్రవారం తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆహారం, నీటి కోసం వివిధ ప్రదేశాలలో దాబాలను పగలు, రాత్రి తెరిచి ఉంచాలని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య, పారామెడికల్ సిబ్బందిని స్వచ్ఛంద సేవకుల ద్విచక్ర వాహనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మహా కుంభమేళా చుట్టూ, రాష్ట్రవ్యాప్తంగా మైళ్ళ దూరంలో చిక్కుకుపోయిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరాను నిర్ధారించాలని ఆయన అన్నారు. మందుల దుకాణాలు 24 గంటలూ తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వాలి. ప్రజలకు బట్టలు, దుప్పట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద వార్తలను అణిచివేయడానికి, ప్రచారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు, బాధితుల కోసం కొన్ని కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని అఖిలేష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+