రాంచీలో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి తప్పిన ప్రమాదం, 180 మంది సేఫ్
రాంచీ: విస్తారా - ఎయిర్ ఇండియా విమానాలకు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. తాజాగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6ఈ 398 విమానం టేకాఫ్‌కు సిద్ధమయింది. ఈ విమానం రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. విమానం బయలుదేరే ముందు పైలట్ గ్రౌండ్ రన్ నిర్వహించాడు.

అప్పుడు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించాడు. వెంటనే టెక్నీషియన్లను పిలిపించాడు. ఆ సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. విమానానికి మరమ్మత్తులు చేసిన తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత విమానం బయలుదేరింది. ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం బయలుదేరింది.












Click it and Unblock the Notifications