అయ్య‌ప్ప భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. స్పాట్ బుకింగ్‌లు ర‌ద్దు..

కేరళలో శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం దేశంలోనే ఎంతో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యం. ఇక్క‌డికి ఏటా భ‌క్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సారి స్వామివారి ద‌ర్శానికి వెళ్లే భ‌క్తులకు ఓ ముఖ్య‌గ‌మ‌నిక‌.. స్పాట్ బుకింగ్‌ల‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకున్నవారినే దర్శనానికి అనుమ‌తిస్తున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. రోజుకి కేవ‌లం 80,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి ద‌ర్శనానికి అనుమ‌తి క‌ల్పించేలా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఆల‌యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ మాసంలో మ‌క‌ర‌విళ‌క్కు పూజ‌లు జ‌రుగుతాయి. ఈ పూజ‌ల సంద‌ర్భంగా ఆల‌యం రెండు నెల‌ల పాటు తెరిచి ఉంచుతారు. ఆ స‌మ‌యంలో అయ్య‌ప్ప భ‌క్తులంతా 41 రోజుల పాటు మాలను ధరించి, స్వామివారి ద‌ర్శ‌నార్థం ఇక్కడికి విచ్చేస్తారు. కానీ, గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య గ‌ణనీయంగా పెరిగింది.

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో జ‌రిగే పూజ‌లు రెండు మాసాల పాటు జ‌రుగుతాయి. ఈ పూజ‌లు ప్ర‌తి ఏటా నవంబరు మూడో వారం నుంచి జనవరి మూడో వారం వరకు జ‌రుగుతాయి. ఈ పూజ‌ల సంద‌ర్భంగా ఆల‌యం ఈ 2 నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది. గ‌త సారి జ‌రిగిన పూజ‌ల్లో భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా పెరిగింది. దీంతో స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ముందుగానే మేల్కొంది. ఈ సారి జ‌ర‌గ‌బోయే మండల, మకరువిళక్కు సీజన్‌ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. శబరిమలలో అమలవుతోన్న స్పాట్‌ బుకింగ్‌లను రద్దు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్‌ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవ‌స్థానం తెలిపింది.

Alert to Ayyappa devotees spot bookings are cancelled

ఈ ఏడాది నవంబరు 15 నుంచి మకరువిళక్కు పూజలు..

అయితే, గతంలో ప‌ది రోజుల ముందు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ దానిని తాజాగా, మూడు నెలల ముందు వరకు పెంచిన‌ట్లు దేవ‌స్థానం తెలిపింది. ఈ ఏడాది నవంబరు 15 నుంచి మండల, మకరువిళక్కు పూజలు ప్రారంభ‌మ‌వుతాయి. జనవరి 14, 2025న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఇందుకోసం కేవ‌లం వర్చువల్‌ క్యూ బుకింగ్‌ చేసుకున్నవారినే దర్శనానికి అనుమతించేలా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ బుకింగ్ ద్వారా దర్శ‌నానికి రోజుకు కేవలం 80,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+