వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధం, తెలంగాణలో టీడీపీ, బీజేపీ దూరం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటుతో దామాషా ప్రకారం పరోక్ష పద్ధతిలో ఓటు వేయ‌నున్నారు.

అనంత‌రం గంట సేప‌టికే ఓట్ల లెక్కింపు నిర్వ‌హించి ఫలితాలు వెల్లడించే అవ‌కాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఖాళీ అవబోతున్న 58 రాజ్యసభ స్థానాలకు 16 రాష్ట్రాల్లో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మూడేసి రాజ్య‌స‌భ సీట్ల‌కు కూడా ఎన్నిక‌లు జరుగుతున్నాయి.

parliament

తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇప్పటికే టీడీపీ, బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 'నోటా'కు కూడా అవ‌కాశం కల్పించారు. ఈ ఎన్నిక‌ల బ‌రిలో తెలంగాణ‌లో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం పార్టీ ఓటు వేయనుంది.

245 స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 58 మంది, కాంగ్రెస్‌కు 54 మంది సభ్యులు ఉన్నారు. తన ప్రాతినిథ్యాన్ని పెంచుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓటింగ్ ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బిహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా(3), జార్ఖండ్ (2), ఛత్తీస్‌గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ (1), ఉత్తరాఖండ్ (1) రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. వీటిలో 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

English summary
Rajya Sabha elections will be held on March 23 to fill the vacancies that will arise after 58 members of the upper house retire early next month. This time, the Rajya Sabha election will be held to elect members from 16 states. Rajya Sabha has a total of 245 seats and 126 seats are needed for a majority in the house. The BJP that currently has 58 members -- four more than the Congress - is expected to better its tally as it rules 11 of the 16 states where Rajya Sabha elections will be held on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X