జార్ఖండ్‌లో బరిలో భార్య, భర్త
జార్ఖండ్ సీఎం, జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సోరెన్ మరోసారి ప్రజా తీర్పుకు రెడీ అవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హేమంత్ సోరెన్ ,తిరిగి మరోసారి అధికారం చేపట్టాలని ఊవిళ్లూరుతున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన టికెట్లు కేటాయించారు. సీఎం హేమంత్ సోరెన్ తన సొంత నియోజకవర్గమైన బర్‌హేట్ (ఎస్టీ) నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు.
మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేదర్ హజారా ఇటీవల హేమంత్ సోరెన్ పార్టీలో చేరారు. ఆయనకు జమూనా నియోజకవర్గం టికెట్ కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ, అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో, ఏజేఎస్‌యూ పార్టీ చీఫ్ సుదేశ్ మహ్తోలు ఉన్నారు. ఇక ఇటీవలే జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నుంచి బీజేపీలో చేరిన హేమంత్ వదిన సీతాసోరెన్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు.దీంతో ఆయా స్థానాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.హేమంత్ సోరెన్ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

'ఇండియా' కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జేఎంఎం 70 చోట్ల, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు 11 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.12 జిల్లాల్లోని 38 స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడతలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 55 మంది మహిళా క్యాండిడేట్స్ ఉన్నారు. మొత్తంగా 1.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా అందులో 147 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసీ రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. రెండు దశల ఫలితాలు ఈ నెల 23నే విడుదల కానున్నాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications