హర్యానాలో ఆల్‌ఖైదా అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని హర్యానాలోని మెవాత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ సమిని అరెస్ట్ చేసిన ఢిల్లీకి చెందిన ప్రత్యేక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు.

ఆల్‌ఖైదా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగించేందుకు ఇతడు సహాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 1 వరకు సమిని పోలీస్ కస్టడీలో రిమాండ్‌కు తరలించారు. సమిని ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు.

Alleged al-Qaeda operative arrested in Haryana

ఒడిశా, ఉత్తరప్రదేశ్, బెంగళూరుల్లో కూడా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందర్ని ఢిల్లీ పోలీసులే అరెస్ట్ చేశారు. ఆల్‌ఖైదా ఈ వ్యక్తులతోనే దేశంలో తమ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రణాళిక వేసిందని పోలీసులు తెలిపారు.

దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి వ్యక్తులపై నిఘా ఉంచామని, త్వరలోనే వారందర్నీ అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+