బిగ్ షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. జమ్ము కాశ్మీర్ లో రాజ్య సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యూనియన్ టెర్రిటరీలోని 4 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని జమ్ము కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రెసిడెంట్ తారిఖ్ హమిద్ ఖర్రా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్ సీ) పార్టీ తమకు సరైన, గెలిచే అవకాశం ఉన్న స్థానాలు ఇవ్వలేదని దాంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. యూనియన్ టెర్రిటరీలో 4 రాజ్య సభ స్థానాలకు అక్టోబర్ 24 న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని జమ్ము కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రెసిడెంట్ తారిఖ్ హమిద్ ఖర్రా తెలిపారు. తాము నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్ సీ) పార్టీతో పొత్తు పెట్టుకున్నామని అయితే గెలిచే స్థానాలను కాంగ్రెస్ కు ఇవ్వలేదన్నారు. దాంతో తాము ఈ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం లేదని పొత్తులో భాగంగా ఇతర రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలోనే రెండు అసెంబ్లీ సీట్లు అయిన బుడ్గామ్, నగ్రోటాలో ఎన్నికలపైనా చర్చించారు. ఇక అక్టోబర్ 24 న జమ్ము కాశ్మీర్ లో రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు బిహార్ లో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. తాజాగా బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక విపక్ష మహాకుటమి కూడా త్వరలోనే పోటీ చేసే స్థానాల వివరాలను ప్రకటించనుంది. ఈ మేరకు ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల్లో అన్ని సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతోపాటు అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications