అంబటి రాయుడు సంచలన నిర్ణయం- వ్యక్తిగత కారణాలతో సీపీఎల్‌కు దూరం
అమరావతి: టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న వేళ.. ఇక పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారే దిశగా అడుగులు వేస్తోన్నారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను మాత్రమే ఆడుతున్నాడు.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు అంబటి రాయుడు. ఈ ఏడాదే పేట్రియాట్స్‌లో జాయిన్ అయ్యారు. ఈ టీమ్‌లో ఇదివరకే ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో అంబటి రాయుడిని తీసుకుందా జట్టు మేనేజ్‌మెంట్. ప్రవీణ్ తంబే తరువాత సీపీఎల్ ఆడిన భారత్‌కు చెందిన రెండో ప్లేయర్ ఆయనే.

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన అంబటి.. 47 పరుగులు చేశారు. మూడు ఇన్నింగ్‌లల్లో 0, 32, 15 పరుగులు చేశారు. తాజాగా- కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. అర్ధాంతరంగా వైదొలిగారు. దీనికి గల కారణాలను తెలియరావట్లేదు. వ్యక్తిగత కారణాలతోనే అంబటి రాయుడు ఈ టోర్నీకి దూరమైనట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించారు అంబటి రాయుడు. ఈ రెండు జట్ల తరఫున 204 మ్యాచ్‌లను ఆడాడు. 14 సీజన్లల్లో 4,329 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను ఆడిన ఘనత అంబటి రాయుడికి ఉంది.
అలాగే ఎనిమిదిసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడారు. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్లల్లో ఆయన సభ్యుడు కూడా. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంబటి రాయుడు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ కలిశారాయన.












Click it and Unblock the Notifications