చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శృంగార తార షకీలా ఔదార్యం: పేదలకు ఆహారం పంపిణీ -లాక్‌డౌన్ ఎత్తివేతపై ముఖ్యమంత్రి కీలక ప్రకటక

|
Google Oneindia TeluguNews

కోట్ల రూపాయాలు సంపాదిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉండి కూడా కరోనా విలయ కాలంలో గమ్మున కూర్చుంటోన్న బడా హీరోలకంటే తన మనసెంతో విశాలమైందని నిరూపించుకున్నారు ఒకప్పటి శృంగార తార, ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్టు షకీలా. కొవిడ్ ఉధృధిని నివారించడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా, కూలి పనులకు వెళితేగానీ పూటగడవని పేదలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. అలాంటి వారికి షకీల ఆపన్నహస్తం అందించారు..

షాకింగ్: పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ -చైనాలో 41ఏళ్ల వ్యక్తికి H10N3 స్ట్రెయిన్- ప్రపంచంలోనే తొలిసారిషాకింగ్: పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ -చైనాలో 41ఏళ్ల వ్యక్తికి H10N3 స్ట్రెయిన్- ప్రపంచంలోనే తొలిసారి

ఒకటి మీకు.. రెండోది పేదలకు

ఒకటి మీకు.. రెండోది పేదలకు

ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఆమె అక్కడి మురికివాడల్లోని పేదలకు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఆహారాన్ని అందిస్తోన్న ఫోటోలతోపాటు కీలక సందేశాన్ని షకీలా షేర్ చేశారు.. ''మనకున్న రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, రెండో చేతిని పేదలకు సాయం చేయడి'' అని ఆమె పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులువ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులు

షకీలాపై ప్రశంసల జల్లు..

షకీలాపై ప్రశంసల జల్లు..

కోట్ల రూపాయాలు పారితోషికం తీసుకునే హీరోయిన్లు తమ హనీమూన్ ఫోటోలు, బాయ్ ఫ్రెండ్స్ లేదా కుక్కలతో సెల్పీలు దిగుతూ కాలక్షేపం చేస్తుండగా, డబ్బు పరంగా తన పరిధి చిన్నదే అయినా పేదల కోసం షకీలా చేస్తోన్ సేవల పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 'కుక్ విత్ క్లౌన్' పేరుతో చేసిన కుకరీ షో హిట్ అయినప్పటి నుంచి షకీలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఇప్పుడు సామాజిక సేవలోనూ పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే,

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Oneindia Telugu
లాక్‌డౌన్‌పై సీఎం కీలక సందేశం

లాక్‌డౌన్‌పై సీఎం కీలక సందేశం

తమిళనాడులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రజలకు కీలక సందేశమిచ్చారు. కొవిడ్ వ్యాప్తిని నివారించడానికి విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టామన్న ఆయన, దాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించలేమని, అది ఆర్థికంగా అందరిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. అయితే, లాక్ డౌన్ ఎత్తేయాలా, వద్దా అన్నది ప్రజల చేతుల్లోనే ఉందని, కొవిడ్ రూల్స్ ను అందరూ కచ్చితంగా పాటిస్తే లాక్ డౌన్ ఎత్తేసేందుకు వీలవుతుందని సీఎం అన్నారు. తమిళనాడులో మొత్తం 20.96లక్షల కేసులు, 24,232మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 3లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

English summary
adult films actress shakeela once again appears in to headlines with her generacity. shakeela distributes food to poor people in chennai who is suffering due to lockdown. pics of shakeela went viral. meanwhile, Tamil Nadu chief minister M K Stalin on Tuesday sought the full cooperation of the people in the state to put an end to the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X