అమిత్ షా తప్పుకో: బీజేపీకి క్యాన్సర్, బోలా సింగ్
పాట్నా: బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ ఓటమి చవిచూడటంతో సొంత పార్టీ నాయకులు బీజేపీ మీద విరుచుకు పడుతున్నారు. ఎక్కడో కూర్చుని నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు అనుభవిస్తున్నారని బీహార్ బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ బోలా సింగ్ మండిపడుతున్నారు.
గురువారం ఆయన జాతీయ టీవీ చానెల్ తో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ లో బీజేపీ ఓడిపోవడానికి వీరిద్దరే కారణం అని ఆరోపించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ఓటమికి గల కారణాలు వివరించాలని, లేదంటే ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవాలని బోలా సింగ్ డిమాండ్ చేశారు. బీజేపీ కి క్యాన్సర్ సోకింది, వెంటనే దీన్ని నిర్మూలించాలని సూచించారు.
అదే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల మీద చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పెద్ద ప్రభావం చూపించాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లోని బెగుసరాయ్ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోలా సింగ్ సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు షాక్ తిన్నారు.












Click it and Unblock the Notifications