గుజరాత్ ప్రచారంలో గోద్రా అల్లర్ల ప్రస్తావన-2002లోనే గుణపాఠం చెప్పామన్న అమిత్ షా...
వచ్చే నెలలో రెండు దఫాలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే టికెట్ ఇవ్వని 20 మందికి పైగా రెబెల్స్ స్వతంత్రులుగా పోటీకి దిగారు. అదే సమయంలో మతపరమైన అంశాల్ని తెరపైకి తెస్తూ మైనార్టీ ఓట్లు తమకు అవసరం లేదని బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి అమిత్ షా గోద్రా అల్లర్ల ఘటనను తెరపైకి తెచ్చారు.
రాష్ట్రంలోని ఖేడా జిల్లాలోని మహుధా పట్టణంలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా అమిత్ షా ఇవాళ ప్రచారం చేశారు.
గుజరాత్ లో 2002లో సంఘ విద్రోహశక్తులు కాంగ్రెస్ సాయంతో చెలరేగిపోయాయని, బీజేపీ వారిని అణచివేసి రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో (1995కి ముందు) కాంగ్రెస్ హయాంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయని, కాంగ్రెస్ వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టేదని షా గుర్తుచేశారు. కమ్యూనిటీలు, కులాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడాలనేది కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. ఇలాంటి అల్లర్ల ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుందని అమిత్ షా ఆరోపించారు. తద్వారా సమాజంలోని అతిపెద్ద వర్గానికి అన్యాయం చేసిందన్నారు.

2002లో గుజరాత్ అల్లర్లను చూసిందని అమిత్ తెలిపారు. ఎందుకంటే నేరస్తులు కాంగ్రెస్ నుంచి సుదీర్ఘకాలంగా తమకు లభించిన మద్దతు కారణంగా హింసలో పాల్గొనడం అలవాటు చేసుకున్నారని ఆరోపించారు. కానీ 2002లో వారికి గుణపాఠం నేర్పిన తర్వాత ఆ శక్తులు హింస మార్గాన్ని విడిచిపెట్టాయన్నారు. 2002 నుండి 2022 వరకు వారు హింసకు దూరంగా ఉన్నారన్నారు. గుజరాత్‌లో బిజెపి హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా శాశ్వత శాంతిని నెలకొల్పిందన్నారు.












Click it and Unblock the Notifications