సౌరభ్ గంగూలీ రెండోసారి అధ్యక్షుడు కాలేకపోవడానికి కారణం ఆయనేనా?

సౌర‌భ్ గంగూలీ దూకుడైన ఆట‌గాడే కాదు.. విజ‌య‌వంత‌మైన కెప్టెన్ కూడా. క్రికెట్ నుంచి విర‌మించిన త‌ర్వాత క్రికెట్ బోర్డులో ప‌రిపాల‌కుడిగా ఉన్నారు. మూడు సంవ‌త్స‌రాల నుంచి బీసీసీఐ అధ్య‌క్షుడిగా కూడా త‌న దూకుడును కొన‌సాగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండుసార్లు సౌర‌భ్ గంగూలీ ఇంటికి వెళ్లారు. ఆ రెండుసార్లు సౌర‌భ్ భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయికానీ అత‌ను ఖండించాడు.

ధనరాశులతో నిండిన బీసీసీఐ

ధనరాశులతో నిండిన బీసీసీఐ

అమిత్ షాతో అంత స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తి క‌చ్చితంగా రెండోసారి కూడా ప‌గ్గాలు చేప‌డతార‌ని భావించారు. కానీ ప‌ద‌వి ద‌క్క‌లేదు. 1983 ప్ర‌పంచ‌క‌ప్ హీరో రోజ‌ర్ బిన్నీ ప్ర‌పంచ‌లోనే అత్యంత ధ‌న‌రాశుల‌తో నిండిన బీసీసీఐకి అధ్య‌క్షుడు కాబోతున్నారు. ఒక‌ర‌కంగా ఇది దేశంలో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ బీసీసీఐలో రాజ‌కీయాల‌ను తెలిసిన‌వారు మాత్రం సాధార‌ణ చ‌ర్య‌గా తీసుకున్నారు.

బీజేపీలో చేరమని ఒత్తిడి?

బీజేపీలో చేరమని ఒత్తిడి?

గంగూలీన బెంగాల్ ఎన్నిక‌ల స‌మ‌యంలోను, ఆ త‌ర్వాత బీజేపీలో చేర‌మ‌ని ఒత్తిడి వ‌చ్చింద‌ని, కానీ అత‌ను నిరాక‌రించాడ‌ని, అందుకే రెండోసారి అధ్యక్ష ప‌ద‌వికి ఎంపిక కాలేక‌పోయాడంటూ తృణ‌మూల్ కాంగ్రెస్ మండిప‌డింది. అమిత్ షా కుమారుడు జై షా బోర్డు కార్య‌ద‌ర్శిగా రెండోసారి ఎంపిక కావ‌చ్చుకానీ గంగూలీ మాత్రం అధ్య‌క్షుడు కాకూడ‌దా? అంటూ ఆ పార్టీ ప్ర‌శ్నించింది.

పార్టీలో చేరనందుకు అవమానిస్తున్నారు?

పార్టీలో చేరనందుకు అవమానిస్తున్నారు?

దాదా క‌మ‌ల‌ద‌ళంలో చేర‌నందుకే అత‌న్ని అవ‌మానించేందుకు ప్ర‌య‌త్నిస్తోందంటూ తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించింది. అయితే బీజేపీ ఈ విమ‌ర్శ‌ల‌ను ఖండించింది. ప్రిన్స్ ఆఫ్ కోల్‌క‌తాను తాము ఎప్పుడూ పార్టీలోకి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌లేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింది.

బీసీసీఐలో మార్పులు జ‌రుగుతున్నందుకు కొంద‌రు మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని, మూడేళ్ల క్రితం గంగూలీ అధ్య‌క్షుడు కావ‌డం వెన‌క వారి పాత్ర ఉందా? అని ప్ర‌శ్నించింది. ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం మానాల‌ని హిత‌వు ప‌లికింది. వాస్త‌వానికి గంగూలీకి బీజేపీలో చేరాల‌నే ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అత‌ను క్రికెట్ కే సేవ‌లందించాల‌ని భావించాడు. అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ క్రికెట్‌వైపే మొగ్గుచూపాడు.

త‌న‌కు జైషాతో ఉన్న స్నేహం వ‌ల్లే అమిత్ షా త‌మ ఇంటికి వ‌చ్చిన‌ట్లు గ‌తంలోనే గంగూలీ తెలిపాడు. ఏదేమైనప్పటికీ సౌరభ్ గంగూలీ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టలేకపోయిన అంశం బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+