బంగాళాఖాతంలో భారీ భూకంపం: వణుకుతున్న తీరం

Bay of Bengal earthquake: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అటు వాయుగుండం తీరం దాటిన కొన్ని గంటల వ్యవధిలోనే బంగాళాఖాతంలో మరో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా రికార్డయింది. 8.27 అక్షాంశం, 91.67 రేఖాంశం మధ్య ఈ ఉదయం సరిగ్గా 9 గంటల 12 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.

An earthquake with a magnitude of 5 2 on the Richter Scale hit the Bay of Bengal

అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి దిశగా 158 కిలోమీటర్లు, పోర్ట్‌బ్లెయిర్‌కు 396 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది.

దీని ప్రభావం అండమాన్ నికోబార్ తీరం వద్ద కనిపించింది. తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. సునామీ సంభవింవచవచ్చనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ జారీ కాలేదు.

ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+